సురేష్‌ బాబుది ధీమా కాదు భయమే!

సురేష్‌ బాబుది ధీమా కాదు భయమే!

'నేనే రాజు నేనే మంత్రి' అసలు బండారం రెండో వారానికే బట్టబయలైపోయింది. తక్కువ బడ్జెట్‌ కావడంతో మొదటి వారంలోనే పెట్టుబడి రాబట్టుకున్న ఈ చిత్రం ప్రస్తుతం అయిదవ వారంలోకి ఎంటరైన ఫిదా కంటే తక్కువ వసూళ్లు నమోదు చేస్తోంది. ఈ చిత్రమే కనుక కాస్త ఎక్కువ పెట్టుబడితో రూపొందినట్టయితే ఈ డ్రాప్‌తో బయ్యర్లు హైరానా పడి వుండేవారే.

ఈ చిత్రంపై అపారమైన నమ్మకం ప్రదర్శించి భారీ స్థాయిలో థియేటర్లు పెట్టి మిగతా చిత్రాలతో పోటీగా దింపిన సురేష్‌బాబు నిజానికి దీనిని సరిగ్గా అంచనా వేసి, తొలి వారంలోనే పెట్టుబడి రాబట్టాలని ఎత్తు వేసారని ఇప్పుడు ఈ చిత్రం డ్రాప్‌ అయిన తీరుని బట్టి అర్థమవుతోంది. నేనే రాజు నేనే మంత్రి చిత్రాన్ని కనుక సగటు రాణా సినిమాలా తక్కువ థియేటర్లలో విడుదల చేసినట్టయితే లాంగ్‌ రన్‌ కోసం తంటాలు పడాల్సి వచ్చేది.

ఈ చిత్రాన్ని బయటి బయ్యర్లకి అమ్మకుండా సొంతంగా విడుదల చేసుకోవడం వల్ల థియేటర్ల పరంగా ఎక్కడా లోటు రాలేదు. ఒక హీరో కమర్షియల్‌ రేంజ్‌ ఏంటనేది తెలియాలంటే అతని చిత్రాలు బయటి బయ్యర్లు కొనాలి. రాణా ఇంకా ఎదిగే దశలోనే వున్నాడు కనుక సురేష్‌బాబు అతని సినిమాలని బయటకి వెళ్లనివ్వడం లేదు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు