త్రివిక్రమ్‌ను మరిచిపోయి.. బోల్తా కొట్టారు

 త్రివిక్రమ్‌ను మరిచిపోయి.. బోల్తా కొట్టారు

'గుండెజారి గల్లంతయ్యిందే' సినిమాతో నితిన్ మార్కెట్ రూ.20-25 కోట్ల మధ్య స్థిరపడ్డట్లే కనిపించింది. హిట్టు కొడితే ఆ రేంజిలో వసూళ్లు గ్యారెంటీ అన్న భరోసా కలిగింది. ఐతే 'అఆ' సినిమాతో ఏకంగా నితిన్‌ను రూ.50 కోట్ల షేర్ మార్కు దాటించేశాడు త్రివిక్రమ్. యుఎస్‌లో అయితే ఈ సినిమా 'బాహుబలి', 'శ్రీమంతడు' సినిమాల తర్వాత మూడో స్థానానికి చేరుకోవడం విశేషం.

కానీ 'అఆ'లో మేజర్ క్రెడిట్ త్రివిక్రమ్‌ది అన్న సంగతి మరిచిపోయారు '14 రీల్స్' వాళ్లు. 'అఆ' వసూళ్లు చూసి నితిన్ రేంజ్ పెరిగిపోయిందనుకుని.. 'లై' మీద ఏకంగా రూ.35 కోట్ల దాకా పెట్టుబడి పెట్టేశారు. ఇప్పుడు చూస్తే పెట్టుబడిలో సగం వెనక్కి రావడం కూడా కష్టంగా ఉంది.

'అఆ'కు ముందు నితిన్ రేంజ్ ప్రకారం చూసుకున్నా 'లై'కి వస్తున్న వసూళ్లు ఏమాత్రం ఆశాజనకంగా లేవు. ఫుల్ రన్లో ఈ చిత్రం రూ.20 కోట్ల షేర్ మార్కును అందుకోవడం కూడా కష్టంగా ఉంది. మామూలుగా నెగెటివ్ టాక్ తెచ్చుకున్న సినిమాలకు మాత్రమే ఈ స్థాయిలో నష్టాలు వస్తుంటాయి. కానీ 'లై' పాజిటివ్ టాక్ తెచ్చుకుని కూడా దెబ్బ తింది. సగటు ప్రేక్షకుడిని దృష్టిలో పెట్టుకోకుండా '1 నేనొక్కడినే' తరహాలో టూ ఇంటలిజెంట్‌గా సినిమాను రూపొందించడం హను రాఘవపూడి చేసిన పెద్ద తప్పిదం.

దీనికి తోడు మరో రెండు క్రేజున్న సినిమాలకు పోటీగా 'లై'ను రిలీజ్ చేయడం ఇంకా పెద్ద దెబ్బ కొట్టింది. మాస్‌కు నచ్చే ఆ రెండు సినిమాల ముందు 'లై' నిలవలేకపోయింది. నామమాత్రపు వసూళ్లతో భారీ నష్టాలు మూటగట్టుకుంటోంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు