బాబీకి మళ్లీ 'సర్దార్‌' సీన్‌ రిపీట్‌

బాబీకి మళ్లీ 'సర్దార్‌' సీన్‌ రిపీట్‌

'సర్దార్‌ గబ్బర్‌సింగ్‌'కి రిలీజ్‌ డేట్‌ ఖాయం చేసుకుని షూటింగ్‌ పార్ట్‌ అంతటినీ తక్కువ టైమ్‌లో పూర్తి చేసేసరికి అది ఎలా తయారైందనేది తెలిసిందే. డైరెక్టర్‌ బాబీకి 'జై లవకుశ' విషయంలోను అదే జరుగుతోంది. ఈ చిత్రాన్ని సెప్టెంబర్‌ 21న విడుదల చేస్తామని ఎప్పుడో ప్రకటించారు. దీంతో డెడ్‌లైన్‌ మీట్‌ అవడం కోసం నలభై రోజుల టాకీ వర్క్‌ని ఇరవై రోజుల్లోనే ముగించారట. ఇక మిగిలిన పాటలు, ప్యాచ్‌ వర్క్‌ తంతు అంతా ఇరవై రోజుల్లో పూర్తి చేయాలట.

సెప్టెంబర్‌ 10కి ఫస్ట్‌ కాపీ సిద్ధం కావాలని డెడ్‌లైన్‌ పెట్టడంతో ఈ చిత్రాన్ని ఉరుకుల పరుగుల మీద కానిచ్చేస్తున్నారట. దీనివల్ల క్వాలిటీ ఎలా వస్తుందోననే ఆందోళన అభిమాన వర్గాల్లో నెలకొంది. స్టార్‌ హీరోలతో సినిమాలు తీసేప్పుడు దర్శకులపై ఇలాంటి ఒత్తిడి తగదు. అయినప్పటికీ బాబీకి వరుసగా రెండు చిత్రాలకీ ఇదే పరిస్థితి ఎదురైంది.

'సర్దార్‌' చిత్రానికి పని చేసినట్టు మూడు యూనిట్లు లేకుండా పూర్తిగా బాబీ చేతుల మీదే ఈ చిత్రం షూటింగ్‌ జరుపుకోవడం అతనికి కాస్త ఊరట. తన కెరియర్‌కి అత్యంత కీలకమైన ఈ చిత్రాన్ని ఇంత ఒత్తిడిలో బాబీ ఎలా తీర్చిదిద్దుతాడనేది వేచి చూడాల్సిందే.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు