తాప్సీ అంత అతి చేసింది దీనికేనా?

తాప్సీ అంత అతి చేసింది దీనికేనా?

పింక్‌ తర్వాత అల్లాటప్పా సినిమాలు చేయడం లేదని, ఒప్పుకునే ప్రతి సినిమాకీ స్టాండర్డ్స్‌ వుండాలని అనుకుంటున్నానని, ముఖ్యంగా తను పోషించే పాత్రలకి ప్రాధాన్యత లేకపోతే అసలు చేయడం లేదని తాప్సీ చెప్పుకొచ్చింది. అంతే కాకుండా తన టాలెంట్‌ని దుర్వినియోగం చేసిందంటూ తెలుగు, తమిళ చిత్ర సీమలపై సెటైర్లు వేసింది. రాఘవేంద్రరావులాంటి దర్శకుల పని తీరుని వెక్కిరించి విమర్శల పాలయింది.

చాలా గ్యాప్‌ తర్వాత మళ్లీ తెలుగులో చేస్తోన్న ఆనందో బ్రహ్మ తన టాలెంట్‌కి తగ్గ సినిమా అని, పింక్‌ అనంతరం తన ప్రతిభ గుర్తించి ఈ పాత్ర ఆఫర్‌ చేసారని తాప్సీ చెబుతూ వచ్చింది. తీరా ఈ సినిమా చూస్తే ఎప్పుడూ దెయ్యం మేకప్‌ వేసుకుని గట్టిగా అరుస్తూ మిగతా పాత్రలని భయపెట్టడం మినహా ఆమె చేసిందేమీ లేదు. పూర్తిగా నలుగురు కమెడియన్లపై నడిచిన ఈ చిత్రంలో తాప్సీది ఒకలాంటి గెస్ట్‌ క్యారెక్టర్‌ మాత్రమే.

కేవలం ఆమెని పోస్టర్‌ వేల్యూ కోసమని సైన్‌ చేసుకున్నారేమో అనిపిస్తుంది. ఆమధ్య రిలీజ్‌ అయిన ఘాజీలో కూడా తాప్సీది కరివేపాకు పాత్రే. పింక్‌ తర్వాత తనని ఏ స్థాయిలో గుర్తించారనేది ఇవి తెలియజేస్తున్నాయి. గ్లామర్‌ హీరోయిన్‌గా వున్నపుడైనా పూర్తిస్థాయి హీరోయిన్‌ పాత్రలు దక్కేవి. ఇప్పుడు కేవలం పోస్టర్‌ మీద ఎట్రాక్షన్‌ కోసమే తాప్సీ పనికొస్తోంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English