పెట్రోల్ పంపులో నుంచి నీళ్లు

పెట్రోల్ పంపులో నుంచి నీళ్లు

వాహ‌న‌దారుల‌కు ఏపీలోని తూర్పుగోదావ‌రి జిల్లా తునిలోని ఒక పెట్రోల్ బంకు ఇచ్చిన షాక్ మామూలుగా లేదు. ఊహ‌కు అంద‌ని రీతిలో జ‌రిగిన ప‌రిణామానికి వాహ‌న‌దారులకు నోట మాట రావ‌టం లేదు. పెట్రోల్ బంకులో పెట్రోల్ పోయించుకున్న పాపానికి భారీ మూల్యాన్నే చెల్లించాల్సి వ‌చ్చింద‌ని వాపోతున్నారు.

ఇంత‌కూ జ‌రిగిందేమంటే.. తుని మండ‌లంలోని ఒక పెట్రోల్ బంకులో పెట్రోల్ బ‌దులు నీళ్లు రావ‌టంలో వాహ‌న‌దారులు తీవ్ర ఇబ్బందుల‌కు గుర‌య్యారు. పెట్రోల్ కొట్టించుకొని బంకు దాటి కాస్త దూరం వెళ్ల‌గానే వాహ‌నాలు ఆగిపోవ‌టంతో అవాక్కు అయ్యారు. వాహ‌నంలో ఏదో సాంకేతిక లోపం చోటు చేసుకుంద‌ని భావించారు.

అయితే.. వాహ‌నంలో ఇబ్బంది లేద‌ని.. అస‌లు చిక్కంతా పెట్రోల్ బంకులోనే ఉంద‌న్న విష‌యాన్ని గుర్తించారు. పెట్రోల్ బంకులో పెట్రోల్ పంపు నుంచి పెట్రోల్ కాకుండా నీళ్లు వ‌స్తున్న వైనంతో అవాక్కు అవుతున్నారు. తుని మండ‌లంలోని ఎర్ర‌కోనేరు జాతీయ ర‌హ‌దారి మీద ఉన్న పెట్రోల్ బంకులో చోటు చేసుకున్న ఈ సిత్రంతో ప‌లు వాహ‌నాలు ఆగిపోయాయి. దీనిపై స‌ద‌రు పెట్రోల్ బంకు య‌జ‌మానిని అడిగితే.. సాంకేతిక లోపం అని చెప్ప‌టంపై వాహ‌న‌దారులు ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు. త‌మ వాహ‌నాల‌కు జ‌రిగిన న‌ష్టానికి ప‌రిహారాన్ని అందించాల‌ని డిమాండ్ చేస్తున్నారు. పెట్రోల్ పంపులో నుంచి నీళ్లు రావ‌టం స్థానికంగా సంచ‌ల‌నం సృష్టిస్తోంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు