‘లెజెండ్’కు ముందు మూడేళ్లు ఫోన్ ముందు..

‘లెజెండ్’కు ముందు మూడేళ్లు ఫోన్ ముందు..

సీనియర్ నటుడు జగపతిబాబు కెరీర్‌లో ఫస్ట్ ఇన్నింగ్స్ ‘గాయం’తో మలుపు తిరిగితే.. రెండో ఇన్నింగ్స్‌ను ‘లెజెండ్’ మలుపు తిరిగింది. ఆ సినిమాకు ముందు జగపతి ఎలాంటి స్థితిలో ఉన్నాడో అందరికీ తెలిసిందే. హీరోగా పూర్తిగా మార్కెట్ కోల్పోయి.. అవకాశాల్లేక బాగా వెనుకబడిపోయాడు జగపతి. అలాంటి స్థితిలో ‘లెజెండ్’లో అదిరిపోయే పాత్రతో జగపతి కెరీర్‌నే మార్చేశాడు బోయపాటి.

ఈ విషయంలో బోయపాటిపై తన కృతజ్నతను ఇంతకుముందు కూడా చూపించాడు జగపతి. తాజాగా హంసలదీవిలో జరిగిన ‘జయ జానకి నాయక’ సక్సెస్ మీట్లో మరోసారి జగపతి ఎమోషనల్ అయ్యాడు. ‘లెజెండ్’కు ముందు తాను ఎలాంటి స్థితిలో ఉన్నది.. బోయపాటి తనను ఎలా ఆదుకున్నది వివరించాడు.

‘‘లెజెండ్ కంటే ముందు మూడేళ్లు చాలా ఇబ్బందికర పరిస్థితుల్లో ఉన్నాను. తెలుగు సినిమాల నుంచి వెళ్లిపోమంటే ఎక్కడికి వెళ్లిపోతాను. నేను మొండోడిని. ఎక్కడికీ వెళ్లను. ఇక్కడే ఉంటా. అప్పుడు కూడా ప్రేక్షకులు నా వెంటే ఉన్నారు. కానీ అవకాశాలే లేవు. మంచి అవకాశం రాకపోదా అని మొబైల్ పట్టుకుని.. ల్యాండ్ లైన్ ముందు కూర్చుని మూడేళ్లు ఎదురు చూశా. అప్పుడు బోయపాటి నన్ను ఆదుకున్నాడు.

‘లెజెండ్’ సినిమాతో నా కెరీర్‌ను మలుపు తిప్పాడు. మామూలుగా నేను చాలా మొండోడిని. ఇగో ఎక్కువ. దాన్ని బేస్ చేసుకునే జితేంద్ర పాత్రను తీర్చిదిద్దాడు. ఆ క్యారెక్టర్ ప్రేక్షకులకు ఎంత బాగా ఎక్కిందో తెలిసిందే. ఇప్పుడు ‘జయ జానకి నాయక’లో మరో అద్భుతమైన పాత్ర ఇచ్చాడు. ఇందులో ‘పరువు’ మీద నా పాత్రను తయారు చేశాడు. ఇది కూడా అంతే మంచి పేరు తెచ్చిపెట్టింది’’ అని జగపతిబాబు అన్నాడు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు