లగడపాటి పిల్లకు లాస్ట్‌ ర్యాంక్‌

లగడపాటి పిల్లకు లాస్ట్‌ ర్యాంక్‌

తెలుగులో తక్కువ సినిమాలే తీసినా, ప్రముఖ పొలిటీషియన్‌ లగడపాటి రాజగోపాల్‌ తమ్ముడిగా లడగపాటి శ్రీధర్‌ చాలా ప్రసిద్ది పొందాడు. అయితే మనోడు చాలా రోజుల గ్యాప్‌ తరువాత మంచు మనోజ్‌తో 'పోటుగాడు' అనే సినిమా తీస్తున్నాడు.

ఇక విషయానికి వస్తే ఆ మధ్య సెలబ్రిటీ క్రికెట్‌ మ్యాచులు జరుగుతున్న టైములో పారుల్‌ యాదవ్‌ అనే అమ్మడును మనోడు బాగా వెనకేసుకొచ్చాడు. కన్నడ చిత్రసీమలో ఇప్పుడిప్పుడే నెట్టుకువస్తున్న పారుల్‌కు తెలుగులో ఆఫర్‌లు ఇప్పించాలని చాలామంది పి.ఆర్‌.ఓ.లకు సిఫార్సు చేశాడట లగడపాటి. అయితే ఈ అమ్మడు మోస్ట్‌ డిజైరబుల్‌ ఉమెన్‌ లిస్టులో టాప్‌ 3లో ఒక ర్యాంక్‌ వస్తుందని కూడా లగడపాటి నమ్మాడట.

కాని అనూహ్యంగా పారుల్‌ యాదవ్‌కు లాస్ట్‌ ర్యాంక్‌ కట్టబెట్టింది బెంగుళూరు యువత. ఆ సిటీలో యువతతో జరిపిన ఒక సర్వేలో, అస్సలు పారుల్‌కు ఓటేసిన వారే లేరు. ఈ వార్త తెలుసుకున్న మనోళ్ళందరూ అరే లగడపాటి పిల్లకు ఇలా జరిగిందేంటి అంటూ ముక్కుమీద వేలేసుకుంటున్నారు. 

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English