మంచు మనోజ్‌.. అక్కడ దూసుకెళ్లొచ్చు

మంచు మనోజ్‌.. అక్కడ దూసుకెళ్లొచ్చు

మంచు మనోజ్ కెరీర్‌కు అత్యంత కీలకమైన సినిమా ‘ఒక్కడు మిగిలాడు’. శౌర్య, ఎటాక్, గుంటూరోడు లాంటి డిజాస్టర్ల తర్వాత అతడి నుంచి వస్తున్న సినిమా ఇది. చాలా గ్యాప్ తీసుకుని.. టైం తీసుకుని ఈ సినిమా చేశాడు మనోజ్. ఇది ఆడకుంటే మనోజ్ కెరీర్ చాలా ఇబ్బందుల్లో పడిపోతుంది. అందుకే దీని మీద చాలానే శ్రద్ధ పెట్టినట్లు కనిపిస్తున్నాడు మనోజ్.

తమిళుల కోసం శ్రీలంక ప్రభుత్వంతో పోరాడిన ఎల్టీటీఈ వ్యవస్థాపకుడు వేలుపిళ్లై ప్రభాకరన్ జీవిత కథ ఆధారంగా ఈ సినిమా తెరకెక్కడం విశేషం. ఆ మధ్య వచ్చిన ‘ఒక్కడు మిగిలాడు’ టీజర్ చాలా ఇంటెన్స్‌గా సాగుతూ సినిమాపై అంచనాలు పెంచింది. శనివారం దీని ట్రైలర్ రాబోతోంది. సెప్టెంబరు 8న ‘ఒక్కడు మిగిలాడు’ విడుదల కాబోతోంది.

ఈ చిత్రాన్ని తమిళంలో కూడా పెద్ద ఎత్తున విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ‘నా తిరుంబి వరువేన్’ (నేను తిరిగొస్తాను) అనే పేరుతో అక్కడ రిలీజ్ చేయబోతున్నారు. నిజానికి తెలుగోళ్లతో పోలిస్తే తమిళులకు బాగా కనెక్టయ్యే సినిమా ఇది. ప్రభాకరన్‌ను అక్కడి వాళ్లు చాలా అభిమానిస్తారు. శ్రీలంకలో తమిళుల పోరాటం మీద సినిమా అంటే వాళ్లు చాలా ఎమోషనల్‌గా భావిస్తారు.

ప్రభాకరన్ మీద తమిళంలో పూర్తి స్థాయి సినిమా తెరకెక్కలేదు. ఈలోపే తెలుగులో ఇలాంటి ఇంటెన్స్ మూవీ తెరకెక్కడం విశేషమే. ఈ చిత్ర దర్శకుడు అజయ్ నూతక్కి తెలుగువాడే కానీ.. అతను ముందు దర్శకుడిగా పరిచయమైంది.. తనేంటో రుజువు చేసుకున్నది తమిళంలోనే. అతడికి ఆల్రెడీ అక్కడ ఫాలోయింగ్ ఉండటం.. ఇది ప్రభాకరన్ కథతో తెరకెక్కిన సినిమా కావడం వల్ల సరిగా ప్రమోట్ చేసి రిలీజ్ చేస్తే తమిళంలో దీనికి మంచి క్రేజ్ వచ్చే అవకాశముంది. సినిమాలో విషయం ఉంటే అక్కడ పెద్ద హిట్టయ్యే అవకాశం కూడా ఉంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English