'భాగ‌మ‌తి' ఎందుకు లేట్ అవుతుందంటే

'భాగ‌మ‌తి' ఎందుకు లేట్ అవుతుందంటే

ఈ మ‌ధ్య‌కాలంలో టాలీవుడ్ లో హీరోయిన్ ఓరియంటెడ్ సినిమాలు ఎక్కువ‌గానే వ‌స్తున్నాయి. గ‌తంలో విజ‌య‌శాంతి ఎక్కువ‌గా న‌టించి ప్రేక్ష‌కుల‌ను మెప్పించేది. ఆ స్థానాన్ని ప్ర‌స్తుతం అనుష్క భ‌ర్తీ చేసింద‌ని చెప్ప‌వ‌చ్చు. అరుంధ‌తి, పంచాక్ష‌రి, రుద్ర‌మ‌దేవి వంటి చిత్రాల‌లో అద్భుతంగా ప‌ర్ ఫార్మ్ చేసింది అనుష్క‌.

దీంతో, లేడీ ఓరియంటెడ్ మూవీస్ తీయాల‌నుకునే ద‌ర్శ‌క నిర్మాత‌ల‌కు మొద‌ట అనుష్క పేరే గుర్తుకు వ‌స్తుంది. గ‌త చిత్రాల త‌ర‌హాలోనే అనుష్క మ‌రో లేడీ ఓరియంటెడ్ మూవీ భాగ‌మ‌తి లో న‌టిస్తోంది. ఈ సినిమాలో విఎఫ్ ఎక్స్ కోసం భారీ

బలమైన పాత్రలను కూడా అవలీలగా పోషించ‌గ‌ల‌న‌ని అరుంధ‌తి సినిమాతో అనుష్క ప్రూవ్ చేసింది. రుద్ర‌మ‌దేవి త‌ర్వాత తెర‌కెక్కుతున్న‌ 'భాగమతి' సినిమాపై భారీ అంచ‌నాలున్నాయి. ఆ అంచ‌నాల‌ను అందుకునేందుకు ఈ చిత్రంలోని విజువ‌ల్ ఎఫెక్ట్స్ పై ద‌ర్శ‌క‌నిర్మాత‌లు ఫోక‌స్ పెట్టారు. ఈ సినిమాలో వి ఎఫ్ ఎక్స్  అద్భుతంగా రావాలనే ఉద్దేశంతో ఎక్కువ సమయాన్ని కేటాయించారు.

ప్రస్తుతం ముంబైలో ఈ చిత్రం వి ఎఫ్ ఎక్స్ వర్క్ జరుగుతోంది. ప్ర‌స్తుతం ఈ సినిమా షూటింగ్ పూర్తయింది. పోస్ట్ ప్రొడక్షన్ పనులు జ‌రుగుతున్నాయి. నవంబర్ నాటికి మిగిలిన ప‌నులను పూర్తి చేసి, డిసెంబర్లో సినిమాను విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు. రుద్ర‌మ‌దేవి త‌ర‌హాలోనే ఈ  సినిమా తనకి మరింత క్రేజ్ ను తీసుకొస్తుందనే నమ్మకంతో అనుష్క వుంది.  

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు