ఒకే వేదిక‌పై ఇద్ద‌రు సూప‌ర్ స్టార్ లు?

ఒకే వేదిక‌పై ఇద్ద‌రు సూప‌ర్ స్టార్ లు?

ప్రిన్స్ మ‌హేష్ బాబు అప్ క‌మింగ్ మూవీ స్పైడ‌ర్ కోసం అభిమానులు ఎంత‌గానో ఎదురుచూస్తున్నారు.  తెలుగు, త‌మిళ భాష‌ల్లో మురుగ‌దాస్ ద‌ర్శ‌క‌త్వంలో ఈ సినిమా షూటింగ్ శ‌ర‌వేగంగా సాగుతోంది. సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబుకు ఇదే తొలి స్ట్రెయిట్ త‌మిళ చిత్రం కావ‌డంతో త‌మిళ ప్రేక్ష‌కుల‌కు మ‌హేష్ ను గ్రాండ్ గా ప‌రిచ‌యం చేయాల‌ని ఆ చిత్ర నిర్మాత‌లు ప్లాన్ చేస్తున్న సంగ‌తి తెలిసిందే. ఇందుకోసం వారు  ఓ భారీ ఈవెంట్ ను నిర్వ‌హించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు.

అదే త‌ర‌హాలో త‌మిళ‌నాడులో ‘స్పైడర్‌’ కు విప‌రీత‌మైన ప్ర‌చారం క‌ల్పించేందుకు ఆ సినిమా థియేట్రికల్‌ రైట్స్‌ను ద‌క్కించుకున్న  లైకా ప్రొడక్షన్స్ ప్ర‌య‌త్నిస్తోంది. లైకా ప్రొడ‌క్ష‌న్స్ ఆధ్వ‌ర్యంలో త్వ‌ర‌లోనే చెన్నైలో ఈ సినిమా ప్ర‌చార కార్య‌క్ర‌మాన్ని నిర్వ‌హించ‌నున్నారు. ఈ ప్ర‌చార కార్య‌క్ర‌మానికి ముఖ్య అతిథులుగా త‌మిళ సూప‌ర్ స్టార్ ర‌జ‌నీకాంత్ తో పాటు, ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు శంక‌ర్ ను లైకా ఆహ్వానించిన‌ట్లు తెలుస్తోంది. ఇదే జ‌రిగితే ఒకే వేదిక‌పై ఇద్ద‌రు సూప‌ర్ స్టార్ లను చూసే అరుదైన‌ అవ‌కాశం త‌మిళ ప్ర‌జ‌ల‌కు ద‌క్కుతుంది.  ప్ర‌స్తుతం లైకా ప్రొడ‌క్ష‌న్స్ నిర్మిస్తోన్న రోబో 2.0 సినిమాలో త‌లైవా న‌టిస్తున్న సంగ‌తి తెలిసిందే.  అయితే, ఈ విష‌యంపై స్పైడ‌ర్ యూనిట్ నుంచి అధికారికంగా ప్ర‌క‌టన రావాల్సి ఉంది.

ప్రస్తుతం స్పైడ‌ర్ పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ జ‌రుపుకుంటోంది. సెప్టెంబర్ 27న ఆ సినిమా రిలీజ్ కానుంది. మహేష్ కు జోడీగా రకుల్ ప్రీత్ సింగ్ న‌టిస్తున్న ఈ సినిమాలో, తమిళ నటుడు దర్శకుడు ఎస్ జె సూర్య విల‌న్ రోల్ లో న‌టిస్తున్నాడు. ఈ సినిమాలో మ‌రో ప్ర‌తినాయ‌కుడి పాత్ర‌లో ప్రేమిస్తే ఫేం భ‌ర‌త్ న‌టిస్తున్న సంగ‌తి తెలిసిందే.   

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు