ఒక వైపు బాలయ్య.. ఇంకోవైపు సన్నీ

ఒక వైపు బాలయ్య.. ఇంకోవైపు సన్నీ

సోషల్ మీడియాలో ప్రతి రోజూ ఎవరో ఒక సెలబ్రెటీ హాట్ టాపిక్ అవుతుంటారు. అది మంచి రీజనా.. చెడ్డ రీజనా అన్నది తర్వాత.. దేశవ్యాప్తంగా సోషల్ మీడియాలో హైలైట్ అవుతుంటారు సెలబ్రెటీలు. అలా ఈ గురువారం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన సెలబ్రెటీలు ఇద్దరున్నారు. అందులో ఒకరు నందమూరి బాలకృష్ణ అయితే.. మరొకరు సన్నీలియోన్. ముందుగా బాలయ్య ఉదయం నుంచి హాట్ టాపిక్ కగా.. కొంచెం లేటుగా సన్నీ లియోన్ రేసులోకి వచ్చింది.

ముందుగా బాలయ్య విషయానికి వస్తే.. తన దుందుడుకుతనంతో ఆయన మరోసారి వార్తల్లో నిలిచారు. నంద్యాలలో ఉప ఎన్నికల ప్రచారం ముగించుకుని రాత్రి తాను బస చేయల్సిన భవనంలోకి వెళ్తూ వెళ్తూ తన మీద పడబోయిన అభిమానిని లాగిపెట్టి ఒకటిచ్చి మొబైల్ కెమెరాకు దొరికిపోయారు. ఈ ఉదయం నుంచి సోషల్ మీడియాలో ఈ వీడియో వైరల్ అవుతోంది. వాట్సాప్ గ్రూపుల్లో కూడా ఇదే హాట్ టాపిక్. ఈ వీడియో నేషనల్ మీడియా చేతికి కూడా చిక్కింది. బాలయ్య డజ్ ఇట్ అగైన్.. అంటూ వాళ్లు కూడా రెచ్చిపోతున్నారు.

ఇక మరోవైపు సన్నీ సంగతి చూస్తే.. ఆమె ఒక షో రూం ఓపెనింగ్ కోసమని కేరళకు వెళ్లింది. తనను చూడటానికి వేలాది మంది వచ్చేశారు. ఆమె కారు రోడ్డు మీద కదల్లేని స్థాయికి రోడ్డుపై పెద్ద ఎత్తున గుమిగూడారు. ఎవరో పెద్ద సూపర్ స్టార్‌ను చూడటానికి ఎలా ఎగబడతారో అలా సన్నీ కోసం వచ్చారు కొచ్చి జనాలు. దానికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయిపోయాయి. ఆమె ఆ కార్యక్రమానికి సంబంధించి ఏర్పాటు చేసిన స్టేజ్ మీదికి ఎక్కితే.. తనను దగ్గర్నుంచి చూడటం కోసం ఆ స్టేజ్ పక్క నుంచి బట్టను చించుకుని మరీ లోపలికి తలపెట్టి ఓ అభిమాని చూస్తున్న దృశ్యం షాకింగ్ అంటే షాకింగే. తనపై ఈ అభిమానానికి సంబంధించిన ఫొటోలు వీడియోల్ని ట్విటర్లో షేర్ చేసుకుని మురిసిపోయింది సన్నీ.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు