సెల్‌ ఫోన్లుంటాయి బాలకృష్ణగారూ!

సెల్‌ ఫోన్లుంటాయి బాలకృష్ణగారూ!

వారానికోసారి బాలకృష్ణ ఎవరినో కొట్టాడనో, తిట్టాడనో వార్తలు రావడం కామన్‌ అయిపోయింది. బాలకృష్ణకి క్షణికావేశం ఎక్కువ అనేది ఇండస్ట్రీలో చాలా మందికి తెలుసు. అలాగే అతడిని అభిమానించే వారు కూడా చాలా సార్లు దానిని దగ్గరగా చూసారు. అయితే గతంలో ఆ నోటా ఈ నోటా వినడమే తప్ప బాలయ్య కోపాన్ని నేరుగా చూసే అవకాశం వుండేది కాదు. కనుక ఆయన ఎవరినైనా కొట్టాడనే విషయం పుకారుగానే వినిపించేది తప్ప వార్త అయ్యేది కాదు. కానీ ఇప్పుడు ఎక్కడ చూసినా సెల్‌ ఫోన్లుంటున్నాయి.

ఎవరైనా సెలబ్రిటీ కనిపిస్తే వాళ్లని కళ్లతో చూడడం కంటే ఫోన్లో బంధించడానికే అందరూ పోటీ పడుతున్నారు. ఈ నేపథ్యంలో పబ్లిక్‌ అప్పీయరెన్స్‌ అపుడు ఆవేశాన్ని అదుపులో వుంచుకోవాల్సిన అవసరం చాలా వుంది. అయితే కోపం వస్తే క్షణం ఆలోచించని బాలయ్య తనకి చిరాకు తెప్పించిన ఎవరిపై అయినా కానీ చేతులు విసుర్తున్నారు. ఇటీవల షూటింగ్‌ స్పాట్‌లో అసిస్టెంట్‌పై చేయి చేసుకోవడం నేషనల్‌ వైడ్‌ న్యూస్‌ అయింది. అది మరచిపోక ముందే మరోసారి ఒక అభిమాని చెంప గట్టిగా వాయించి మళ్లీ వార్తల్లోకి వచ్చారు. సెలబ్రిటీకి డిస్టెన్స్‌ మెయింటైన్‌ చేయాలనే కామన్‌ సెన్స్‌ అందరికీ వుండదు.

పబ్లిక్‌లోకి వెళ్లినపుడు ఎవరో ఒకరు మీద పడిపోతూ వుంటారు. అలా అని వాళ్లని కొట్టుకుంటూ పోవడం కరక్ట్‌ కాదు. అసలే శాసనసభ్యుడు కూడా అవడంతో నేషనల్‌ మీడియా దీనిని మరింతగా ఫోకస్‌ చేస్తోంది. దీని వల్ల బాలయ్య ఇమేజ్‌ డ్యామేజ్‌ కావడంతో పాటు రాజకీయంగాను ప్రభావం చూపించే దిశగా వెళుతోంది. యాంగర్‌ మేనేజ్‌మెంట్‌ విషయంలో బాలయ్య శ్రద్ధ వహిస్తే మంచిదని నందమూరి అభిమానులు చర్చించుకుంటున్నారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English