ఆమెకి నాలుగు కోట్లు ఇచ్చే సీనుందా?

ఆమెకి నాలుగు కోట్లు ఇచ్చే సీనుందా?

ప్రభాస్‌ పక్కన జాతీయ వ్యాప్తంగా తెలిసిన హీరోయిన్‌ని పెట్టాలనే 'సాహో' నిర్మాతల కల సాకారమైంది. చాలా మంది హీరోయిన్లతో మంతనాలు సాగించి, అనుష్కనే మళ్లీ రిపీట్‌ చేయాలని భావించి చివరకు శ్రద్ధా కపూర్‌ని తీసుకున్నారు. బాలీవుడ్‌లో సెకండ్‌ గ్రేడ్‌ హీరోయిన్‌ అయిన శ్రద్ధకి సాహోలాంటి పెద్ద సినిమాలో నటించే అవకాశం రావడం అదృష్టమే అనుకోవాలి.

కానీ సౌత్‌ హీరోతో సినిమా అనేసరికి ఆమె చెట్టెక్కి కూర్చుంది. ఈ చిత్రాన్ని తెలుగుతో పాటు తమిళం, హిందీలో కూడా రిలీజ్‌ చేస్తారు కనుక, తను బల్క్‌ డేట్స్‌ ఇవ్వాల్సి వుంటుంది కనుక అయిదు కోట్ల పారితోషికం కావాలని అడిగిందట. హీరోయిన్‌ కోసం అంత పెట్టడానికి మామూలుగా అయితే నిర్మాతలు ఇష్టపడరు. కానీ శ్రద్ధ వల్ల సాహోకి బాలీవుడ్‌లో అదనపు ఆకర్షణ వస్తుందని, శాటిలైట్‌ రైట్స్‌, ఇతర రైట్స్‌ రూపంలో హెల్ప్‌ అవుతుందని నమ్ముతున్నారు.

అందుకే ఆమెతో బేరమాడి చివరకు నాలుగు కోట్లకి డీల్‌ ఓకే చేసారట. ఈ నాలుగు కోట్లు కాకుండా శ్రద్ధకి అయ్యే ఖర్చులు వేరే వుంటాయట. మన హీరోయిన్లకి ఎన్ని హిట్లున్నా రెండు కోట్లు ఇవ్వడానికి వెనకాడే నిర్మాతలు, బాలీవుడ్‌లో ఫ్లాప్‌ హీరోయిన్‌కి కూడా నాలుగు కోట్లు ఇస్తున్నారన్నమాట. ఇంతా చేసి ఆమె వల్ల సాహోకి ఏమైనా ఒరుగుతుందా లేదా అనేది విడుదలైతే కానీ చెప్పలేం.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English