ఇదేమి బీటింగ్‌ అండీ బాబూ!

ఇదేమి బీటింగ్‌ అండీ బాబూ!

మూడు కొత్త సినిమాలు రిలీజయ్యాయి. విడుదలై మూడు వారాలైపోయింది కనుక ఫిదా ఒక చల్లబడుతుందని అంచనా వేసారు. కానీ కాంపిటీషన్‌లోను, తక్కువ థియేటర్లతోను ఫిదా రచ్చ కొనసాగుతోంది. ముఖ్యంగా నైజాం ఏరియాలో ఈ చిత్రానికి కొత్త సినిమాలకి తీసిపోని షేర్లు వస్తున్నాయి.

ఇరవై ఆరు రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా నలభై నాలుగు కోట్లకి పైగా షేర్‌ సాధించిన ఫిదా మరికొన్ని రోజుల పాటు షేర్స్‌ మీదే నడిచేలా వుంది. నైజాంలో ఇప్పటికే దాదాపు పదిహేడు కోట్ల షేర్‌ వసూలు కాగా, రన్‌ పూర్తయ్యేసరికి పద్ధెనిమిదిన్నర నుంచి పంతొమ్మిది కోట్ల షేర్‌ వస్తుందని అంచనా వేస్తున్నారు. సూపర్‌హిట్‌ టాక్‌ వచ్చినపుడు పాతిక కోట్ల షేర్‌ వస్తుందేమో అనుకున్నది కాస్తా ఇప్పుడు దానికి డబుల్‌ వసూలు చేసేట్టు కనిపిస్తోంది.

ఓవర్సీస్‌లో నాన్నకు ప్రేమతో వసూళ్లని దాటేసి, నాన్‌-బాహుబలి చిత్రాల్లో నాలుగో స్థానంలో నిలిచింది. మెగా హీరోల్లో ఖైదీ నంబర్‌ 150 తప్ప మిగతా అన్నిటి వసూళ్లని ఫిదా దాటేసింది. ఈ చిత్రం ఇంత పెద్ద హిట్‌ అవడంతో శేఖర్‌ కమ్ముల బ్రాండ్‌ వేల్యూ డబుల్‌ అవగా, వరుణ్‌ తేజ్‌ మార్కెట్‌ మరింత విస్తృతమైంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు