‘అర్జున్ రెడ్డి’పై తమిళ అటాక్

 ‘అర్జున్ రెడ్డి’పై తమిళ అటాక్

గత శుక్రవారం ఒకే రోజు ఒకటికి మూడు సినిమాలు వచ్చేశాయి. ఇక ఫోకస్ తర్వాతి శుక్రవారం మీదికి మళ్లింది. ఈ వీకెండ్లో ఒకే ఒక్క కొత్త సినిమా రాబోతుండటం విశేషం. అదే.. ‘ఆనందో బ్రహ్మ’. ఈ హార్రర్ కామెడీకి పోటీగా ‘ఉంగరాల రాంబాబు’ వస్తుందని.. ‘రఘువరన్ బీటెక్’ సీక్వెల్ ‘వీఐపీ-2’ కూడా రేసులో ఉంటుందని అన్నారు. కానీ ఆ రెండు సినిమాలూ వాయిదా పడిపోయాయి.

‘ఆనందో బ్రహ్మ’ సోలోగా రంగంలోకి దిగబోతోంది. 18వ తేదీకి అనుకున్న ‘వీఐపీ-2’ను ఇంకో వారం పాటు వాయిదా వేశారు. ఈ చిత్ర తమిళ వెర్షన్ గత శుక్రవారమే విడుదలైంది. యావరేజ్ టాక్ తెచ్చుకుంది. 18న రిలీజ్ చేయడానికి ఏం ఇబ్బంది వచ్చిందో కానీ.. ఈ చిత్రాన్ని 25కు వాయిదా వేసేశారు.

25వ తేదీ రిలీజవుతున్న ఏకైక తెలుగు సినిమా ‘అర్జున్ రెడ్డి’. దాంతో పాటుగా రావాల్సిన ‘యుద్ధం శరణం’ వాయిదా పడిపోయింది. ఐతే ఇప్పుడు ‘అర్జున్ రెడ్డి’కి రెండు తమిళ సినిమాలు పోటీ ఇస్తుండటం విశేషమే. ‘అర్జున్ రెడ్డి’ రావడానికి ఒక రోజు ముందే అజిత్ మూవీ ‘వివేకం’ రిలీజవుతుంది. మరుసటి రోజు ‘వీఐపీ’ విడుదలవుతుంది. కాబట్టి ఒక తెలుగు సినిమా.. రెండు తమిళ డబ్బింగ్ సినిమాల మధ్య పోటీ ఉంటుందన్నమాట.

ఐతే ఈ రెండూ కూడా ‘అర్జున్ రెడ్డి’కి ఏమాత్రం పోటీ ఇస్తాయన్నది సందేహమే. చిన్న సినిమాగా మొదలైన ‘అర్జున్ రెడ్డి’ ఆసక్తికర టీజర్, ట్రైలర్లతో ప్రేక్షకుల్లో క్యూరియాసిటీ పెంచింది. మంచి క్రేజ్ సంపాదించుకుంది. ఈ చిత్రానికి ఓపెనింగ్స్ అనూహ్యంగా ఉంటాయని అంచనా వేస్తున్నారు.


 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు