మణిరత్నంకు భలే హీరో దొరికాడులే..

మణిరత్నంకు భలే హీరో దొరికాడులే..

దక్షిణాది నటీనటులకే కాదు.. ఉత్తరాది వాళ్లకు కూడా మణిరత్నంతో పని చేయడం అన్నది ఒక కల. ప్రముఖ నటీనటులు సైతం ఆయనతో పని చేయడాన్ని లైఫ్ టైం ఛాన్స్‌గా భావిస్తారు. మరి మామూలు సినిమాలు తీస్తాడా.. మామూలు పాత్రలు సృష్టిస్తాడా మణిరత్నం? ఐతే ఒకప్పుడు ఆయనకున్న పేరు.. క్రెడిబిలిటీ.. క్రేజ్.. గత కొన్నేళ్లలో దెబ్బ తిన్నాయి. ఒక్క ‘ఓకే బంగారం’ మినహాయిస్తే గత దశాబ్ద కాలంలో మణి నుంచి ఓ మోస్తరు సినిమా కూడా రాలేదు.

ఆయన చివరగా తీసిన ‘చెలియా’ కూడా పెద్ద డిజాస్టర్ అయింది. దీంతో మణితో పని చేయడానికి ఇంతకుముందున్నంత ఆసక్తి నటీనటుల్లో ఇప్పుడు కనిపించడం లేదు. అంతా అనుకున్నట్లు జరిగితే రామ్ చరణ్ మణి తర్వాతి సినిమాలో నటించాల్సింది కానీ.. ‘చెలియా’ ఫలితం చూసి అతను వెనక్కి తగ్గినట్లుగా వార్తలొచ్చాయి.

ఐతే రామ్ చరణ్ సంగతేమో కానీ.. ఇప్పుడైతే మణిరత్నంకు భలే హీరో దొరికేశాడు. విలక్షణమైన సినిమాలతో.. అద్భుతమైన పాత్రలతో.. అదిరిపోయే నటనలతో గత కొన్నేళ్లలో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు సంపాదించిన విజయ్ సేతుపతి మణిరత్నం కొత్త సినిమాలో కథానాయకుడిగా నటించబోతుండటం విశేషం. దీనిపై అధికారిక సమాచారం కూడా బయటికి వచ్చేసింది. ఇది అదిరిపోయే కాంబినేషన్ అంటూ కోలీవుడ్లో ఆసక్తికర చర్చ జరుగుతోంది. సోషల్ మీడియాలో ఈ కాంబినేషన్ గురించి పెద్ద ఎత్తున డిస్కషన్లు నడుస్తున్నాయి.

ఈ చిత్రానికి లెజెండరీ సినిమాటోగ్రాఫర్ సంతోష్ శివన్ ఛాయాగ్రహణం అందించబోతున్నాడు. ఇంతకుముందు మణి-సంతోష్ కలిసి చివరగా ‘రావన్’ సినిమాకు పని చేశారు. ఎప్పట్లాగే ఎ.ఆర్.రెహమాన్ ఈ చిత్రానికి సంగీతం అందించబోతున్నాడు. ఈ చిత్రానికి కథానాయిక ఎవరో తేలాల్సి ఉంది. మణిరత్నమే స్వయంగా ఈ చిత్రాన్ని నిర్మించబోతున్నాడు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు