నోళ్లు మూయించే పని మీదున్న డైరెక్టర్‌

నోళ్లు మూయించే పని మీదున్న డైరెక్టర్‌

'దువ్వాడ జగన్నాథమ్‌'ని క్రిటిక్సే చంపేసారని హరీష్‌ శంకర్‌ బలంగా నమ్మాడు. తన సినిమాలో అన్ని మసాలాలు బాగా వున్నా కానీ కావాలని దీనిని చిదిమేసారని విమర్శకులపై విరుచుకు పడ్డాడు. ఈమధ్య కాలంలో ఒక దర్శకుడు విమర్శకుల మీద ఇంతగా ఫైర్‌ అవలేదు. రొటీన్‌ డైరెక్టర్‌గా తనపై ముద్ర వేసేయడంతో హర్ట్‌ అయిన హరీష్‌ శంకర్‌ ఈసారి కంటెంట్‌ బేస్డ్‌ సినిమాతో విమర్శకులకి సమాధానం ఇవ్వాలని అనుకుంటున్నాడు.

అందుకే ఒక మల్టీస్టారర్‌ కథని సిద్ధం చేస్తున్నాడు. దాగుడు మూతలు అనే టైటిల్‌తో దిల్‌ రాజు బ్యానర్లో ఈ చిత్రం చేయబోతున్నాడు. అమెరికాలో షూటింగ్‌ జరుపుకునే ఈ చిత్రంలో ఇద్దరు హీరోలు నటిస్తారట. ప్రస్తుతం హిట్స్‌లో వున్న ఇద్దరు యువ హీరోలతో దిల్‌ రాజు మంతనాలు సాగిస్తున్నాడని, అయితే ఆ ఇద్దరికీ వేరే కమిట్‌మెంట్లు వుండడం వల్ల వాళ్ల డేట్స్‌ దొరికినా కానీ ఇది మొదలు కావడానికి కాస్త టైమ్‌ పడుతుందని సమాచారం.

ఇంట్రెస్టింగ్‌ మైండ్‌ గేమ్స్‌తో కొత్త రకం స్క్రీన్‌ప్లేతో ఈ చిత్రం సాగుతుందని, హరీష్‌ శంకర్‌ దీనిని ఛాలెంజింగ్‌గా తీసుకుని తన టెంప్లేట్‌కి భిన్నంగా తెరకెక్కించనున్నాడని తెలిసింది. మరి విమర్శకులకి సమాధానం ఇచ్చే క్రమంలో హరీష్‌ కమర్షియల్‌గా సక్సెస్‌ అవుతాడా లేదా అన్నది చూడాలి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు