పంతానికి పోయి ఫ్లాపయిన నితిన్‌

పంతానికి పోయి ఫ్లాపయిన నితిన్‌

ఆగస్టు 11న 'లై' రిలీజ్‌ చేస్తున్నట్టు ముందుగా ప్రకటించింది లై నిర్మాతలే. అయితే ఒక డేట్‌ని ఒకరు బుక్‌ చేసుకున్న తర్వాత మరొకరు ఆ డేట్‌కి రాకూడదనే రూల్‌ లేదు. అందుకే అదే డేట్‌కి మరో రెండు చిత్రాలు లైన్లోకి వచ్చాయి. అయితే ముందుగా డేట్‌ అనౌన్స్‌ చేసింది తామే కనుక ఆ డేట్‌పై నైతిక హక్కు తమదేనని 'లై' మేకర్స్‌ వాదించారు. నితిన్‌ తండ్రి సుధాకర్‌రెడ్డికి పంపిణీ రంగంపై పట్టు వుండడంతో థియేటర్ల సమస్య ఏర్పడలేదు.

అయితే లై మేకర్స్‌ ఒక విషయంలో తప్పు లెక్క వేసారు. రెండు మాస్‌ సినిమాలతో లైని పోటీగా దింపడం వల్ల బి, సి సెంటర్స్‌లో ఈ చిత్రానికి అసలు అడ్వాంటేజ్‌ లేకుండా పోయింది. బెల్లంకొండ శ్రీను, రాణా కంటే నితిన్‌ పేరున్న హీరో అయినా కానీ 'లై' అనేది పక్కా క్లాస్‌ సినిమా. దర్శకుడు హనుకి కూడా ఏ విధమైన మాస్‌ ఫాలోయింగ్‌ లేదు. ఈ నేపథ్యంలో లాంగ్‌ హాలిడే అడ్వాంటేజ్‌ కోసం చూడకుండా లైని సోలోగా రిలీజ్‌ చేయాల్సింది.

ఈ విషయంలో నితిన్‌కి, చిత్ర నిర్మాతలకి పలువురు నచ్చచెప్పినా కానీ ఫస్ట్‌ డేట్‌ అనౌన్స్‌ చేసింది తామే కనుక వెనక్కి తగ్గమని అన్నారట. నాలుగు రోజులు సెలవులు వుంటాయి కనుక, ఏ సెంటర్స్‌లో మంచి టాక్‌ వస్తుందనే నమ్మకం వుండడంతో వాయిదా వేసుకోమని తేల్చేసారట. ఈ క్లాష్‌లో లైకే ఎక్కువ నష్టం జరిగింది. సోలో రిలీజ్‌ అయి వుంటే లై వసూళ్లు ఇంత దారుణంగా అయితే వచ్చి వుండేవి కాదు. సినిమా కూడా అంత బ్యాడ్‌ టాక్‌ తెచ్చుకోలేదు కానీ త్రిముఖ పోటీలో లైకే హోల్‌సేల్‌గా హూల్‌ పడిపోయింది పాపం.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు