సాయిధరమ్.. అసలు తగ్గట్లేదుగా

సాయిధరమ్.. అసలు తగ్గట్లేదుగా

పోయినేడాది వచ్చిన ‘తిక్క’ డిజాస్టర్.. ఈ ఏడాది ఆరంభంలో రిలీజైన ‘విన్నర్’ కూడా అట్టర్ ఫ్లాపే.. ఇక ఈ మధ్యే వచ్చిన ‘నక్షత్రం’ సంగతి చెప్పాల్సిన పని లేదు. మొత్తానికి డిజాస్టర్లలో హ్యాట్రిక్ కొట్టేశాడు సాయిధరమ్ తేజ్. పిల్లా నువ్వు లేని జీవితం, సుబ్రమణ్యం ఫర్ సేల్, సుప్రీమ్ లాంటి హిట్లతో స్టార్ అయిపోతున్నట్లుగా కనిపించిన తేజు.. ఏడాది తిరిగే సరికి చాలా ఇబ్బందికర పరిస్థితుల్లో పడిపోయాడు. ఐతే ఇలా వరుసబెట్టి ఫ్లాపులు వస్తున్నప్పటికీ తేజుకు అవకాశాలకైతే కొదవలేదు. ఒకటి తర్వాత ఒకటి సినిమాలు అతడి తలుపు తడుతున్నాయి. బి.వి.ఎస్.రవి దర్శకత్వంలో తేజు నటించిన ‘జవాన్’ విడుదలకు సిద్ధమవుతున్న సంగతి తెలిసిందే.

ఇంతలోనే స్టార్ డైరెక్టర్ వి.వి.వినాయక్ దర్శకత్వంలో ఓ సినిమాను ఇటీవలే మొదలుపెట్టాడు తేజు. వచ్చే నెలలో ఈ చిత్ర రెగ్యులర్ షూటింగ్ ఆరంభం కానుంది. ఈలోపే తేజు సినిమా మరొకటి ప్రారంభోత్సవం జరుపుకోనుంది. పవన్ కళ్యాణ్ కెరీర్లో మైలురాయి అనదగ్గ ‘తొలి ప్రేమ’తో దర్శకుడిగా పరిచయమైన కరుణాకరన్ దర్శకత్వంలో తేజు నటించే సినిమా ఈ బుధవారమే ఆరంభం కాబోతోంది.

ఇంతకుముందు కరుణాకరన్‌తో ‘వాసు’ సినిమాను నిర్మించిన సీనియర్ నిర్మాత కె.ఎస్.రామారావు ఈ చిత్రాన్ని ప్రొడ్యూస్ చేయబోతుండటం విశేషం. ‘తొలి ప్రేమ’ తర్వాత ఆ స్థాయికి తగ్గ సినిమా ఒక్కటీ తీయలేకపోయిన కరుణాకరన్.. గత కొన్నేళ్లలో చాలా ఫ్లాపులు తిన్నాడు. అయినప్పటికీ తేజు అతడితో సినిమా చేయడానికి సాహసించడం విశేషమే. వినాయక్‌తో పక్కా మాస్ మసాలా సినిమా చేయబోతున్న తేజు.. దానికి భిన్నంగా కరుణాకరన్‌తో రొమాంటిక్ మూవీ చేస్తున్నాడట. మరోవైపు దిల్ రాజు నిర్మాణంలో ‘శతమానం భవతి’ దర్శకుడు సతీశ్ వేగేశ్నతో ‘శ్రీనివాస కళ్యాణం’ అనే సినిమా కూడా చేయబోతున్నాడు తేజు.

 
 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English