ప‌వ‌న్ బ‌ర్త్ డే రోజు ఫ‌స్ట్ లుక్‌!

ప‌వ‌న్ బ‌ర్త్ డే రోజు ఫ‌స్ట్ లుక్‌!

‘పవర్‌స్టార్‌’ పవన్‌కల్యాణ్‌, మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ శ్రీ‌నివాస్ ద‌ర్శ‌క‌త్వంలో వ‌చ్చిన అత్తారింటికి దారేది చిత్రం బాక్సాఫీస్ రికార్డుల‌ను షేక్ చేసిన సంగతి తెలిసిందే. అందుకే ఈ హిట్ కాంబినేష‌న్ లో తెర‌కెక్కుతున్న సినిమాపై భారీ అంచ‌నాలున్నాయి. అందులోనూ ఈ సినిమా త‌ర్వాత ప‌వ‌న్ క్రియాశీల రాజ‌కీయాల్లో యాక్టివ్ గా ఉండ‌బోతున్నాన‌ని స్వ‌యంగా ప్ర‌క‌టించాడు.

దీంతో ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ భారీ స్థాయిలో జ‌రిగింది. ఈ  సినిమాలో ప‌వ‌న్ తొలిసారిగా ఓ సాఫ్ట్ వేర్ ఇంజ‌నీర్ పాత్ర‌లో క‌నిపించ‌బోతున్నాడు. త‌న పుట్టిన రోజు సంద‌ర్భంగా అభిమానుల‌కు ప‌వ‌న్ గిఫ్ట్ ఇవ్వ‌బోతున్నాడు. ఆ రోజు త‌న తాజా చిత్ర ఫ‌స్ట్ లుక్ ను విడుద‌ల చేయాల‌ని ప్లాన్ చేస్తున్న‌ట్లు టాలీవుడ్ టాక్‌.

ప‌వ‌న్ తాజా చిత్ర షూటింగ్ శ‌ర‌వేగంగా జ‌రుగుతోంది. ఈ సినిమాకి ఇంకా టైటిల్‌ ఖరారు కాలేదు. సెప్టెంబరు 2న పవన్‌ పుట్టినరోజు సంద‌ర్భంగా ఈ చిత్ర ఫస్ట్‌లుక్‌ను విడుదల చేయనున్నట్లు టాలీవుడ్‌ వర్గాల సమాచారం. ఇందులో పవన్‌కి జోడీగా కీర్తి సురేశ్‌, అను ఇమ్మాన్యుయేల్ నటిస్తున్నారు.ఈ సినిమా విడుదలకు ముందే రూ.150 కోట్లకు పైగా బిజినెస్‌ చేసినట్లు తెలుస్తోంది.

బాహుబలి తర్వాత రికార్డు పవన్‌ కల్యాణ్‌దేనని టాలీవుడ్‌లో వూహాగానాలు నెలకొన్నాయి. ఈ క్రేజీ కాంబోలో తెర‌కెక్కుతున్న సినిమా విడుద‌ల‌య్యాక మ‌రిన్ని రికార్డులు నెల‌కొల్పుతుంద‌ని ట్రేడ్ విశ్లేష‌కుల అంచ‌నా.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు