ప్రభాస్ లుక్... ఇలా ఫిక్సయిపోండి!

ప్రభాస్ లుక్... ఇలా ఫిక్సయిపోండి!

 ‘బాహుబలి’ తర్వాత ప్రభాస్ చేసే సినిమా గురించి మూడేళ్లుగా చర్చ జరుగుతోంది. ‘బాహుబలి: ది బిగినింగ్’ విడుదల కాకముందే సుజీత్ దర్శకత్వంలో సినిమా చేయడానికి కమిటయ్యాడు ప్రభాస్. కానీ కమిటైన మూడేళ్లకు కూడా ఈ సినిమా పట్టాలెక్కలేదు.

ప్రభాస్ ‘బాహుబలి: ది కంక్లూజన్’ పని పూర్తి చేసి కూడా పది నెలలు కావస్తోంది. కానీ ‘సాహో’ కోసం ఇంకా ముఖానికి రంగేసుకోలేదు. ఈ చిత్రం ఈ ఏడాది ఆరంభంలో లాంఛనంగా ప్రారంభోత్సవం అయితే జరుపుకుంది. కానీ ఆ ప్రి ప్రొడక్షన్ పనులు పూర్తి కాకపోవడంతో రెగ్యులర్ షూటింగ్ ఆలస్యమైంది.

నెల కిందటే ఈ చిత్ర షూటింగ్ మొదలైనట్లు చెప్పారు కానీ.. ప్రభాస్ మాత్రం ఇంకా షూటింగ్‌లో జాయినవ్వనే లేదు. ఐతే ఎట్టకేలకు ప్రభాస్ ‘సాహో’ పని మొదలుపెట్టేస్తున్నాడు. సరిగ్గా ఇంకో వారం రోజుల్లో ‘సాహో’ సెట్లో అడుగుపెడతాడట ప్రభాస్. ఆరు నెలలు నిర్విరామంగా ఈ సినిమాకు పని చేసేలా షెడ్యూళ్లు కూడా ప్లాన్ చేశారు. ‘బాహుబలి’ పని పూర్తయ్యాక జుట్టు కత్తిరించి.. డిఫరెంట్ లుక్స్‌లో కనిపించాడు యంగ్ రెబల్ స్టార్.

పక్కాగా ‘సాహో’ లుక్ ఇదీ అన్న ఐడియా జనాలకు లేకపోయింది. ఐతే ‘సాహో’ షూటింగ్ మొదలయ్యే ముందు చివరగా ప్రభాస్ ‘ఆనందో బ్రహ్మ’ ప్రి రిలీజ్ ఈవెంట్లో పాల్గొన్నాడు. మేకప్ తో కొన్ని టచప్స్ ఉంటే ఉండొచ్చు కానీ.. ఇక్కడ ఎలా కనిపించాడో దానికి దగ్గరగానే ‘సాహో’లో ఉంటాడని భావిస్తున్నారు. ఈ చిత్రం 2018 వేసవిలో ప్రేక్షకుల ముందుకొచ్చే అవకాశముంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English