చరణ్‌ని ఇంకా వదల్లేదు

చరణ్‌ని ఇంకా వదల్లేదు

'రంగస్థలం 1985' తర్వాత మణిరత్నంతో చరణ్‌ ఓ చిత్రం చేస్తాడని వార్తలొచ్చాయి. చెలియా ఫ్లాప్‌ తర్వాత ఆ ప్రాజెక్ట్‌ డ్రాప్‌ అయిందనే అనుకున్నారు. చరణ్‌ కూడా కొరటాల శివ చిత్రాన్ని అనౌన్స్‌ చేయడంతో ఇక మణిరత్నం సినిమా లేనట్టేనని ఫిక్స్‌ అయిపోయారు.

అయితే ఇంత కాలం సైలెంట్‌గా వున్న మణిరత్నం తన ప్లాన్స్‌లో తానున్నారు. ఈ చిత్రం కోసం మిగతా స్టార్‌ కాస్ట్‌ని మణిరత్నం ఫైనలైజ్‌ చేస్తూనే వున్నారు. అరవింద్‌ స్వామి, ఐశ్వర్యారాయ్‌ ఇందులో నటిస్తారని ఎప్పుడో ప్రకటించారు. తాజాగా సైఫ్‌ అలీ ఖాన్‌ కుమార్తె సారా అలీ ఖాన్‌ ఇందులో చరణ్‌కి జోడీగా నటిస్తుందనే వార్త మీడియాలో వచ్చింది.

ఈ చిత్రాన్ని తెలుగుతో పాటు తమిళం, హిందీలో తీయాలని చూస్తోన్న మణిరత్నం తన ప్రయత్నాలయితే ఆపలేదు. మరి చరణ్‌ ఈ కమిట్‌మెంట్‌ విషయంలో ఇంకా అలాగే వున్నాడా లేక ఫైనల్‌గా మణిరత్నంకి హ్యాండిస్తాడా అనేది చూడాలి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు