బోయపాటికి సింపతీ వర్కవుట్‌ అవుతోంది

బోయపాటికి సింపతీ వర్కవుట్‌ అవుతోంది

అనుభవజ్ఞుడైన నిర్మాత లేకపోయినా, పంపిణీ రంగంపై పట్టు లేని బయ్యర్లు వున్నా భారీ సినిమాలకి ఎంత నష్టమనేది 'జయ జానకి నాయక' విషయంలో రుజువైంది. ఈ చిత్రానికి రిలీజ్‌ డేట్‌ ఎప్పుడో ఫిక్స్‌ అయినా కానీ ముందుగా థియేటర్లు బ్లాక్‌ చేయడంలో నిర్మాత, బయ్యర్లు విఫలమయ్యారు. దాంతో మిగతా నిర్మాతలకి తమ ఆధిపత్యం చూపించే అవకాశం దక్కింది.

భారీ పెట్టుబడులు పెట్టిన బయ్యర్లు కూడా అటెంటివ్‌గా లేకపోవడంతో 'జయ జానకి నాయక'కి థియేటర్ల కేటాయింపు పరంగా అన్యాయం జరిగింది. ఇంతగా ఈ చిత్రాన్ని అణచివేసినప్పటికీ 'జయ జానకి నాయక' అన్ని చోట్ల మంచి షేర్లు సాధిస్తోంది. తక్కువ థియేటర్లతోనే 'నేనే రాజు నేనే మంత్రి'కి ధీటైన సమాధానం ఇస్తోంది. స్టార్‌ హీరో లేకపోయినప్పటికీ కేవలం బోయపాటి తన బ్రాండ్‌ నేమ్‌తో ఈ చిత్రానికి సాధిస్తోన్న వసూళ్లతో అతనికి సింపతీ వర్కవుట్‌ అవుతోంది.

ఇంతగా ఈ చిత్రాన్ని అణచి వేయాలని చూసినా దీనిని బోయపాటి నిలబెట్టిన తీరుకి అతడిపై ప్రశంసలు కురుస్తున్నాయి. అయితే ఇంకా రాబట్టాల్సినది చాలా వున్న నేపథ్యంలో బోయపాటి హవా దీనిని ఎంతవరకు తీసుకెళ్లగలదనేది ఆసక్తిరమైంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు