పాక్ పై హీరో వైర‌ల్ ట్వీట్‌!

పాక్ పై  హీరో వైర‌ల్ ట్వీట్‌!

భార‌త్, పాక్ ల మ‌ధ్య ఉద్రిక్త ప‌రిస్థితుల నేప‌థ్యంలో సెల‌బ్రిటీల వ్యాఖ్య‌ల‌కు అధిక ప్రాధాన్య‌త ఉంటుంది. అందులోనూ సినిమా హీరోల కామెంట్ల‌కు అనుకూల లేదా వ్య‌తిరేక స్పంద‌న‌లు చాలా త్వ‌ర‌గా వ‌స్తాయి. పాక్ పై బాలీవుడ్ సీనియ‌ర్ న‌టుడు రిషీక‌పూర్ త‌ర‌చుగా చేసే ట్వీట్లు వివాదాస్ప‌ద‌మ‌వుతుంటాయి. అదే త‌ర‌హాలో తాజాగా, దాయ‌ది దేశం పాకిస్థాన్ పై  రిషీ క‌పూర్‌ చేసిన ట్వీట్ ఇంట‌ర్నెట్ లో వైర‌ల్ అయింది. ఈ రోజు స్వాతంత్య్రం జ‌రుపుకుంటున్న పాకిస్థాన్ కు రిషీ క‌పూర్ శుభాకాంక్ష‌లు తెలుపుతూ చేసిన ట్వీట్ పై మిశ్ర‌మ స్పంద‌న‌లు వ‌చ్చాయి. ఇటువంటి ట్వీట్లు ఇరు దేశాల మ‌ధ్య స్నేహ భావాన్ని పెంపొందిస్తాయ‌ని కొంద‌రు, శ‌త్రు దేశానికి శుభాకాంక్ష‌లు చెప్ప‌డం ఏమిట‌ని మ‌రికొంద‌రు రిషీ ట్వీట్ పై కామెంట్ చేశారు.

విషింగ్ ఆల్ మై ఫ్రెండ్స్ ఫ్రం పాకిస్థాన్ ఎ హ్యాపీ యౌమ్‌-ఏ-ఆజాదీ కా దిన్‌. హ్యాపీ ఇండిపెండెన్స్ డే. లెట్ పీస్ , ల‌వ్ & బ్ర‌ద‌ర్ హుడ్ ప్రివెయిల్స్ అంటూ రిషీ ట్వీట్ చేశారు. పాక్ స్వాతంత్య్ర‌ దినోత్స‌వం సంద‌ర్భంగా ఆయన పాకిస్థాన్ ప్ర‌జ‌ల‌కు శుభాకాంక్ష‌లు తెలియ‌జేస్తూ చేసిన ట్వీట్‌పై నెటిజ‌న్లు మిశ్ర‌మంగా స్పందించారు. `ఇరు దేశాల మ‌ధ్య సౌభ్రాతృత్వం బ‌ల‌ప‌రిచే ట్వీట్‌` అంటూ కొంతమంది నెటిజ‌న్లు పొగ‌డ్త‌లు కురిపించారు. `ఉగ్ర‌వాదుల దేశానికి శుభాకాంక్ష‌లు చెబుతావా?` అంటూ   మ‌రికొంత మంది రిషీ ట్వీట్ పై మండిప‌డ్డారు. అస‌లు ఈ ట్వీట్ కు బ‌దులు చెప్పాల్సిన అవ‌స‌రం కూడా లేదంటూ కొంద‌రు స్పందించారు. గ‌తంలో ఐసీసీ ఛాంపియ‌న్స్ ట్రోఫీ స‌మ‌యంలో పాకిస్థానీ ఆట‌గాళ్లను మెచ్చుకుంటూ ట్వీట్ చేసి రిషీ పై నెటిజన్లు తీవ్ర‌స్థాయిలో విరుచుకుప‌డ్డారు.