మహేష్‌ స్పీడ్‌కి అందరూ ఫిదా

మహేష్‌ స్పీడ్‌కి అందరూ ఫిదా

మహేష్‌ 'స్పైడర్‌' ఇంకా రిలీజ్‌ కాకముందే, అతని తదుపరి చిత్రం 'భరత్‌ అనే నేను' రెండు షెడ్యూల్స్‌ షూటింగ్‌ పూర్తి చేసుకుంది. సంక్రాంతికి ఈ చిత్రం రిలీజ్‌ అవడం ఖాయమని వార్తలొస్తున్నాయి. ఇంకా అది సెట్స్‌ మీద వుండగానే వంశీ పైడిపల్లితో చేస్తోన్న సినిమాకి ముహూర్తం చేసేసారు. దీనిని వచ్చే ఆగస్టులో విడుదల చేస్తారని చెబుతున్నారు.

అంటే ఈ సెప్టెంబర్‌ నుంచి వచ్చే ఆగస్టు లోగా పదకొండు నెలల్లో మహేష్‌వి మూడు చిత్రాలు రిలీజ్‌ అవుతాయన్నమాట. సూపర్‌స్టార్స్‌ అంతా సినిమా తర్వాత సినిమా ఎప్పుడో తెలియక కథల కోసం అన్వేషిస్తోంటే మహేష్‌ మూడు చిత్రాలని లైన్లో పెట్టాడు. త్రివిక్రమ్‌తో పాటు రాజమౌళితో కూడా కమిట్‌మెంట్‌ చేసుకున్నాడు. ఎలా చూసినా మహేష్‌ లైన్‌ అప్‌ ముందు మిగతా వాళ్లవి తేలిపోతున్నాయి.

పవన్‌కళ్యాణ్‌ ఇక సినిమాలకి స్వస్తి చెప్పనున్న నేపథ్యంలో మహేష్‌ స్పీడ్‌ పెంచేసి మిగతా హీరోలకి అందనంత వేగంతో దూసుకుపోతున్నాడు. ఈ ఊపులో రెండు బ్లాక్‌బస్టర్లు పడితే చాలు, మహేష్‌ని చాన్నాళ్లుగా ఊరిస్తోన్న నంబర్‌వన్‌ కిరీటం అతని వశమైపోతుంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు