‘బిగ్ బాస్’లోకి ఆ నటుడు...

‘బిగ్ బాస్’లోకి ఆ నటుడు...

ఆరంభంలో మిక్స్డ్‌ రెస్పాన్స్ తెచ్చుకున్నప్పటికీ ఆ తర్వాత స్టడీగానే సాగిపోతోంది తెలుగు ‘బిగ్ బాస్’ షో. దానికంటూ ఓ ప్రత్యేక ప్రేక్షక వర్గం తయారైంది. ఈ షోకు అలవాటు పడ్డవాళ్లూ రోజూ మిస్సవ్వకుండా ఎపిసోడ్లు చూసేస్తున్నారు. టీవీలో ఫస్ట్ ఎపిసోడ్ మిస్సయిన వాళ్లు.. రిపీట్ చేసినప్పుడో.. లేదా ఆన్ లైన్లోనో చూసుకుంటున్నారు. ‘బిగ్ బాస్’ నిర్వాహకులు కూడా షో ఆకర్షణ కోల్పోకుండా ఎప్పటికప్పుడు ఏదో ఒక అట్రాక్షన్ జోడిస్తూ ప్రేక్ష్కుల్ని ఎంటర్టైన్ చేసే ప్రయత్నంలో ఉన్నారు.

ఈ షోలోకి వైల్డ్ కార్డ్ ఎంట్రీతో హాట్ భామ దీక్షా పంత్‌ను తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. ఇప్పుడు రెండో వైల్డ్ కార్డ్ ఎంట్రీకి రంగం సిద్ధమైంది. ఇందుకోసం ఓ వివాదాస్పద నటుడిని ఫైనలైజ్ చేశారట. అతనే.. నవదీప్.

ఈ శుక్రవారం విడుదలైన ‘నేనే రాజు నేనే మంత్రి’లో కీలక పాత్రలో కనిపించిన నవదీప్‌కు బయట పెద్దగా అవకాశాలేమీ లేవు. చాన్నాళ్లుగా అతడి పేరే వినిపించట్లేదు టాలీవుడ్లో. ఐతే ఇటీవలే బ్రేక్ అయిన డ్రగ్స్ కేసులో నోటీసులందుకుని.. విచారణకు హాజరై రావడంతో అతను వార్తల్లోకి వచ్చాడు. ఇలాంటి తరుణంలో అతను ‘బిగ్ బాస్’లోకి వస్తే వస్తే వినోదానికి ఢోకా ఉండదు. ‘బిగ్ బాస్’లో యూత్ ఫుల్ నెస్ తగ్గిందన్న అభిప్రాయాల నేపథ్యంలో నవదీప్ రాకతో ఆ లోటు కొంత తగ్గొచ్చు.

దీక్షా పంత్.. అర్చన లాంటి వాళ్లతో నవదీప్ కొంచెం కొంటెగా ప్రవర్తిస్తే షోకు ఆకర్షణ పెరిగే అవకాశముంది. మరో విశేషం ఏంటంటే.. ఈ వారం ‘బిగ్ బాస్’ నుంచి ఇద్దరు పార్టిసిపెంట్లు ఎలిమినేట్ అవుతారట. వాళ్లెవ్వరో రేపు తెలుస్తుంది. అదే సమయంలో నవదీప్ వైల్డ్ కార్డ్ ఎంట్రీ గురించి కూడా సమాచారం ఇస్తారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు