‘నేనే రాజు నేనే మంత్రి’లో తన భార్య చనిపోతే.. ఆ శవాన్ని అడ్డం పెట్టుకుని సింపతీ పొందడం ద్వారా ముఖ్యమంత్రి కుర్చీని టార్గెట్ చేస్తాడు హీరో. దీన్ని ఉద్దేశించి వచ్చే డైలాగులు ప్రస్తుతం చర్చనీయాంశం అవుతున్నాయి. హీరో శవ రాజకీయాలు చేస్తున్నాడని.. అతడికి జనాల్ని దగ్గరికి తీసుకోవడం.. చెంపలు పట్టుకోవడం.. వాళ్ల తలలు నిమరడం.. బుగ్గలు గిల్లడం బాగా వంట బట్టిందని ఓ పంచ్ వేస్తాడు విలన్.
ఈ సిచువేషన్.. ఈ డైలాగులు ఆంధ్రప్రదేశ్ ప్రతి పక్ష నేత జగన్‌ను ఉద్దేశించి పెట్టినవే అన్న చర్చ నడుస్తోంది సోషల్ మీడియాలో. వైఎస్ చనిపోయాక ఆయన పార్థివ దేహం ఇంట్లో ఉండగానే రాజకీయాలు చేసే ప్రయత్నం చేశాడని తెలుగుదేశం నాయకులు అతడి మీద విమర్శలు చేస్తుంటారన్న సంగతి తెలిసిందే.
ఇక జగన్ మూణ్నాలుగేళ్ల పాటు చేసిన ఓదార్పు యాత్ర విషయంలోనూ అనేక కామెంట్లు.. సెటైర్లు ఎదుర్కొన్నాడతను. జనాల్ని దగ్గరికి తీసుకోవడం.. తల నిమరడం.. కొందరికి ముద్దులు పెట్టడం.. బుగ్గలు పట్టుకుని మాట్లాడటం.. ఇలాంటివి చాలానే చేశాడు జగన్. దాని మీద సోషల్ మీడియాలో చాలా ట్రోలింగ్ నడిచింది అప్పట్లో. సమకాలీన రాజకీయ అంశాల ప్రస్తావన చాలానే చేసిన తేజ.. జగన్‌ను ఉద్దేశించే చివర్లో సన్నివేశాలు అల్లుకున్నాడని.. డైలాగులు పెట్టాడని జనాలు చర్చించుకుంటున్నారు. అలాగని మిగతా పార్టీల వాళ్లనేమీ తేలిగ్గా వదిలిపెట్టేయలేదు తేజ.
ప్రస్తుతం రాజకీయాల్లోని జంప్ జిలానీల గురించి సెటైర్లు గుప్పించడం ద్వారా తెలుగుదేశం పార్టీని కూడా టార్గెట్ చేసుకున్నాడు. మొత్తంగా మన రాజకీయ వ్యవస్థ మీద తేజ సెటైర్లు బాగానే పేల్చాడు ‘నేనే రాజు నేనే మంత్రి’ ద్వారా.
ఆ డైలాగ్ ఎవరినుద్దేశించి రానా?
Aug 12, 2017
126 Shares
రాజకీయ వార్తలు
-
కాశ్మీర్‌పై కమల్ షాకింగ్ కామెంట్స్
Feb 19,2019
126 Shares
-
సానియా ఆ స్టేట్మెంట్ ఎందుకిచ్చింది?
Feb 18,2019
126 Shares
-
పుల్వామా మరో ఘోరం - నలుగురు జవాన్ల వీరమరణం!
Feb 18,2019
126 Shares
-
ఈ పోరును!.. లోకేశే తీర్చాలి!
Feb 18,2019
126 Shares
-
బీసీ గర్జనలో జగనే సీఎం
Feb 17,2019
126 Shares
-
లక్ష్మణ్ కీలక ప్రకటన...దత్తాత్రేయ ఇక ఇంటికేనా?
Feb 17,2019
126 Shares
సినిమా వార్తలు
-
శంకర్‌ని వాళ్లు కూడా భరించలేరు
Feb 19,2019
126 Shares
-
బయ్యర్ల నెత్తిన ఎన్టీఆర్ శఠగోపం?
Feb 19,2019
126 Shares
-
చాప కింద నీరులా... సూపర్‌స్టార్‌గా!
Feb 19,2019
126 Shares
-
సైలెంట్‌గా వుండమన్న బాలకృష్ణ
Feb 19,2019
126 Shares
-
అఖిల్ కంటే చైతన్య బెటర్!
Feb 19,2019
126 Shares
-
మీటూపై ఎట్టకేలకు స్పందించాడు
Feb 19,2019
126 Shares