బోయపాటి రివర్స్ పంచ్!

బోయపాటి రివర్స్ పంచ్!

ఈ శుక్రవారం మూడు సినిమాలు రిలీజవుతున్న నేపథ్యంలో వీటిలో  మీ ఛాయిస్ ఏది అంటూ సోషల్ మీడియాలో మూణ్నాలుగు రోజుల ముందు నుంచి పోల్స్ పెట్టారు చాలామంది. వాటిలో ఎక్కువమంది పట్టం కట్టింది ‘నేనే రాజు నేనే మంత్రి’కే. ‘లై’కి రెండో స్థానం దక్కింది. దాదాపు 80 శాతం మంది ఈ సినిమాలకే ఓటేశారు. పది శాతానికి అటు ఇటు మాత్రమే ‘జయ జానకి నాయక’ను ఎంచుకున్నారు. కానీ ఈ మూడు సినిమాలకు వచ్చిన టాక్.. చూస్తుంటే మాత్రం చివరికి ‘జయ జానకి నాయక’నే విజేతగా నిలిచేలా కనిపిస్తోంది. మూడు సినిమాల్లో వేటికీ నెగెటివ్ టాక్ రాకపోవడం విశేషం. కానీ ఎక్కువ పాజటివ్ టాక్ వినిపిస్తున్నది మాత్రం ‘జయ జానకి నాయక’కే.

‘లై’ సినిమా ఇంటలిజెంట్ థ్రిల్లర్ అనిపించుకున్నప్పటికీ అది లిమిటెడ్ అప్పీల్ ఉన్న సినిమా అన్నది స్పష్టం. మల్టీప్లెక్స్ ఆడియన్స్ బాగానే ఆదరించినప్పటికీ.. బి-సి సెంటర్ల ప్రేక్షకులకు రీచ్ కావడం కష్టమే అంటున్నారు ట్రేడ్ పండిట్స్. ఇక ‘నేనే రాజు నేనే మంత్రి’ విషయానికొస్తే.. అది కూడా ఓ వర్గం ప్రేక్షకులకు పరిమితమయ్యే సినిమానే. సీరియస్ గా సాగే ఈ పొలిటికల్ డ్రామా.. సగటు ప్రేక్షకుడికి ఏమాత్రం కనెక్టవుతుందన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఐతే తొలి రోజు రానా సినిమా కలెక్షన్ల విషయంలో నెంబర్ వన్ స్థానంలో నిలిస్తే.. ‘లై’ కూడా మంచి ఓపెనింగ్సే తెచ్చుకుంది. ఐతే ‘జయ జానకి నాయక’ ఫస్ట్ ఛాయిస్ కాకపోవడం వల్ల ఉదయం డల్లుగా నడించింది.

కానీ సాయంత్రానికి కలెక్షన్లు బాగా పుంజుకున్నట్లు తెలుస్తోంది. బి-సి సెంటర్లలో అయితే ఉదయం నుంచే సినిమాకు మంచి వసూళ్లు వచ్చాయి. సాయంత్రానికి ఈ సినిమా పుంజుకున్న తీరు చూస్తే.. అంతిమంగా ఈ సినిమానే బాక్సాఫీస్ విజేత అయితే ఆశ్చర్యమేమీ లేదు. ఉన్నంతలో ఫ్యామిలీ ఆడియన్స్‌కు కనెక్టయ్యే సినిమా ఏదంటే.. ‘జయ జానకి నాయక’ అనే చెప్పాలి. మాస్ ప్రేక్షకులకూ ఇది విందే కాబట్టి.. ఫుల్ రన్లో ఈ సినిమా మంచి వసూళ్లే సాధించే అవకాశముంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English