అతనికి బాలకృష్ణ భయపడ్డాడా?

అతనికి బాలకృష్ణ భయపడ్డాడా?

బాలకృష్ణ ఏమిటి, ఒకరికి భయపడడం ఏమిటి అనుకుంటున్నారా? సాధారణంగా మాట ఇస్తే వెనక్కి తగ్గని బాలయ్య ఒక సినిమా విషయంలో పునరాలోచనలో పడ్డారని గుసగుసలు గట్టిగా వినిపిస్తున్నాయి. ఎన్టీఆర్‌ జీవిత కథ ఆధారంగా రాంగోపాల్‌వర్మ దర్శకత్వంలో సినిమా చేద్దామని అనుకున్న బాలకృష్ణ ఆ అనౌన్స్‌మెంట్‌తో వచ్చిన ఫీడ్‌బ్యాక్‌తో ఆ ప్రాజెక్ట్‌ని పక్కన పెట్టేసారని సమాచారం.

అంతటి బృహత్తర ప్రాజెక్ట్‌ని వర్మ చేతిలో పెట్టడమేంటని బాలయ్యకి అభిమానుల నుంచే కాకుండా ఆయన సన్నిహితుల నుంచి కూడా చాలా నెగెటివ్‌ ఫీడ్‌బ్యాక్‌ వచ్చిందట. ఒక దర్శకుడి ట్రాక్‌ రికార్డ్‌ ఏమిటని పట్టించుకోకుండా సినిమా ఓకే చేసే బాలకృష్ణ ఇంత నెగెటివ్‌ ఫీడ్‌బ్యాక్‌తో ఎందుకని వర్మ గురించి ఇలా చెబుతున్నారని ఒక్కసారి ఆలోచించారట.

వర్మ ఇటీవలి కాలంలో తీసిన సినిమాల చిట్టా తెలుసుకుని, బయోపిక్స్‌ పేరిట అతను తెరకెక్కించిన సినిమాల ఫలితాలు చూసి ఈ ప్రాజెక్ట్‌ని ప్రస్తుతానికి వెనక్కి నెట్టారని, ఎన్టీఆర్‌ జీవిత కథతో తీసే సినిమా చరిత్రలో నిలిచిపోయేలా వుండాలని బాలయ్య భావిస్తున్నారు.

ఈ చిత్రాన్ని అనౌన్స్‌ చేస్తూ వర్మ రిలీజ్‌ చేసిన పాట, ప్రెస్‌నోటే నందమూరి అభిమానుల వ్యతిరేకతని తీవ్రతరం చేసిందని భోగట్టా.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English