జయ జానకి నాయక సిట్యువేషన్‌ చాలా బ్యాడ్‌!

జయ జానకి నాయక సిట్యువేషన్‌ చాలా బ్యాడ్‌!

మూడు సినిమాల పోటీలో సినిమాపై జరిగిన వ్యాపారం కంటే సదరు నిర్మాతలు, బయ్యర్ల అనుభవం, బలమే ఆధిపత్యం చలాయిస్తోంది. జయ జానకి నాయక చిత్రంపై అత్యధిక వ్యాపారం జరిగినప్పటికీ ఆగస్టు 11 రిలీజుల్లో థియేటర్ల కేటాయింపు పరంగా దీనికి అన్యాయం జరుగుతోంది.

ఈ చిత్రానికి నిర్మాత కొత్తవాడు కావడం, బయ్యర్లలో చాలా మందికి అనుభవం లేకపోవడంతో బోయపాటి శ్రీను స్ట్రాంగ్‌ అయిన మాస్‌ ఏరియాల్లోను ఎక్కువ థియేటర్లు దొరకడం లేదు. ఉదాహరణకి సీడెడ్‌లో 'నేనే రాజు నేనే మంత్రి'కి డెబ్బయ్‌ థియేటర్లు, 'లై'కి అరవై థియేటర్లు వుంటే 'జయ జానకి నాయక'కి నలభై థియేటర్లు కూడా దొరకలేదు. జయ జానకి నాయక సీడెడ్‌ రైట్స్‌ ఏడు కోట్ల ఇరవై లక్షలకి అమ్మితే, మిగతా రెండు సినిమాలు అందులో సగం కూడా పలకలేదు.

అయినప్పటికీ సురేష్‌బాబుకి వున్న థియేటర్స్‌ చెయిన్‌ వల్ల 'నేనే రాజు నేనే మంత్రి' అత్యధిక థియేటర్లు దక్కించుకుంది. పంపిణీదారుడి పరపతి వల్ల 'లై' లాంటి క్లాస్‌ సినిమాకి కూడా మాస్‌ రీజియన్‌లో భారీ సంఖ్యలో థియేటర్లు దొరికాయి. ఇదే పరిస్థితి తెలుగు రాష్ట్రాలంతటా కనిపిస్తోంది కనుక మొదటి వారంలో 'జయ జానకి నాయక' స్ట్రగుల్‌ అయ్యేట్టుంది. నాలుగు రోజులు సెలవులు వున్నప్పటికీ సినిమా బాగుందనే టాక్‌ బాగా స్ప్రెడ్‌ అయితే తప్ప బెనిఫిట్‌ వుండదనేది ట్రేడ్‌ వర్గాల మాట.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు