బాలకృష్ణ, తర్వాత చిరంజీవి, మహేష్‌!

బాలకృష్ణ, తర్వాత చిరంజీవి, మహేష్‌!

బెల్లంకొండ శ్రీనివాస్‌తో చేసాడు కనుక బోయపాటి శ్రీను ఇక పంథా మార్చి యువ హీరోలతో ప్రేమకథా చిత్రాలు చేస్తాడేమో అనుకుంటే పొరబడ్డట్టే. ఎందుకంటే బోయపాటి తదుపరి మూడు చిత్రాలు భారీ స్థాయిలో వుండబోతున్నాయి. బాలయ్యతో హ్యాట్రిక్‌ సినిమాకి త్వరలోనే శ్రీకారం చుడుతున్నట్టు అతను తెలిపాడు.

బాలకృష్ణ వందవ సినిమాగా రూపొందాల్సిన ఈ చిత్రాన్ని బాలయ్య నూట మూడవ చిత్రంగా తెరకెక్కించబోతున్నాడు. ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించిన కథ ఓకే అయిపోయింది. తన తదుపరి చిత్రంతో బాలయ్యతోనే అని బోయపాటి స్పష్టం చేసాడు. అలాగే ఎప్పట్నుంచో వార్తల్లో వున్న చిరంజీవి చిత్రాన్ని కూడా త్వరలోనే స్టార్ట్‌ చేస్తానని బోయపాటి చెప్పాడు.

గీతా ఆర్ట్స్‌ బ్యానర్లో చిరంజీవితో చేసే చిత్రం 'ఉయ్యాలవాడ నరసింహారెడ్డి' తర్వాత వుంటుందని తెలిపాడు. అలాగే మహేష్‌బాబుతో కూడా ఒక చిత్రం చేయబోతున్నానని బోయపాటి అధికారికంగా ప్రకటించాడు. బోయపాటితో సినిమా చేయాలని మహేష్‌ ప్లాన్‌ చేస్తున్నాడని వచ్చిన వార్తలు నిజమేనని బోయపాటి తేల్చేసాడు. ఈ మూడు సినిమాల తర్వాతే మిగతా వారితో చర్చలు వుంటాయని, ఇవే తన నెక్స్‌ట్‌ మూడు సినిమాలంటూ బోయపాటి స్పష్టం చేసాడు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు