జయ జానకి నాయక... ఎన్ని కోట్లు రావాలి?

జయ జానకి నాయక... ఎన్ని కోట్లు రావాలి?

బోయపాటి శ్రీను పేరు మీదే భారీ బిజినెస్‌ జరిగిన 'జయ జానకి నాయక'పై ట్రేడ్‌ వర్గాలకి ఎక్కువ నమ్మకం వుందనే సంగతి ఈ చిత్రానికి జరిగిన ప్రీ రిలీజ్‌ బిజినెస్సే చెబుతోంది. ఈ చిత్రానికి ప్రపంచ వ్యాప్తంగా ముప్పయ్‌ అయిదు కోట్ల వ్యాపారం జరిగింది. దీంతో పాటు విడుదలవుతోన్న మిగతా రెండు సినిమాలతో పోలిస్తే ఇదే అదిరిపోయే బిజినెస్‌.

హీరోగా బెల్లంకొండ శ్రీనివాస్‌కి ఎలాంటి పుల్‌ లేకపోయినా కానీ బోయపాటి శ్రీను మీద నమ్మకంతో బయ్యర్లు ఇంత పెట్టుబడి పెట్టారు. సింపుల్‌గా చెప్పుకోవాలంటే ఈ సినిమా హిట్‌ అనిపించుకోవాలంటే 'ఫిదా' కంటే ఎక్కువ వసూలు చేయాలి. పోటీ లేని వాతావరణంలో అయితే ఈ టార్గెట్‌ కష్టం కాదేమో కానీ మూడు సినిమాలు రెవెన్యూ పంచుకుంటాయి కనుక దీనిని రికవర్‌ చేయడం అంత ఈజీ కాదు.

బోయపాటి శ్రీను మాత్రం తన సినిమాపై అపారమైన నమ్మకంతో వున్నాడు. తను తీసిన మిగిలిన సినిమాలకి హీరోలు ప్లస్‌ అయితే, దీనికి సబ్జెక్ట్‌ ప్లస్‌ అవుతుందని, పోటీ వున్నా కానీ ఈ చిత్రానికి వున్న కథాబలం వల్ల విజయం తథ్యమని అంటున్నాడు. ఇది కానీ హిట్టయితే బోయపాటి పరపతి అమాంతం రెట్టింపవుతుందనడంలో సందేహం లేదు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English