పాపం రాజశేఖర్‌ బ్యాడ్‌ టైమ్‌ అంతే

పాపం రాజశేఖర్‌ బ్యాడ్‌ టైమ్‌ అంతే

'నేనే రాజు నేనే మంత్రి' అంటూ సంచలనం చేస్తోన్న తేజ తన పరాజయాల్లోంచి వచ్చిన కసిలోంచి పుట్టిన కథే ఇదని అంటున్నాడు. మంచి కథ లేకే తన చిత్రాలు ఫ్లాపవుతున్నాయని గ్రహించి, పంథా మార్చి ఈ కథ రాసుకున్నాడట. అయితే ఈ చిత్రం రానాని దృష్టిలో పెట్టుకుని రాయలేదని, రాజశేఖర్‌ కోసం రాసానని తేజ చెప్పాడు.

రాజశేఖర్‌కి సూటయ్యే కథ కోసం ఆలోచించడం వల్ల ఈ కథ వచ్చిందని, అహం అనే టైటిల్‌తో అతనితో చేద్దామని అనుకున్నానని, కానీ కొన్ని కారణాల వల్ల కుదర్లేదని, ఆ తర్వాత రానాకి అనుగుణంగా మార్పులు చేసి అతనికి చెబితే సింగిల్‌ సిట్టింగ్‌లో ఓకే చేసాడని, ఈ చిత్రానికి వచ్చిన క్రేజ్‌కి ఏమాత్రం తగ్గని విధంగా సినిమా వుంటుందని చెబుతున్నాడు.

తెలుగుతో పాటు ఇతర భాషల్లోను సక్సెస్‌ అవుతుందని ధీమాగా వున్నాడు. తనని మర్చిపోయిన వాళ్లంతా ఈ ట్రెయిలర్‌ చూసిన తర్వాత మళ్లీ గుర్తు చేసుకుంటున్నారని అన్నాడు. అయితే ఈ చిత్రాన్ని మిస్‌ చేసుకున్న రాజశేఖర్‌ది మాత్రం బ్యాడ్‌ టైమ్‌ అనుకోవాలి. ఆర్థిక ఇబ్బందులో వున్న రాజశేఖర్‌కి ఇప్పుడొక సరైన సినిమా కావాలి. ఈ ట్రెయిలర్లు చూస్తోంటే రాజశేఖర్‌ అలాంటి ఒక అవకాశాన్ని మిస్‌ అయిపోయాడనే అనిపిస్తోంది. మరి ఈ లోటుని గరుడవేగ చిత్రం పూడుస్తుందో లేదో చూడాలి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English