కొత్త కాంట్రవర్శీలో కోలీవుడ్ బ్యాడ్ బాయ్

కొత్త కాంట్రవర్శీలో కోలీవుడ్ బ్యాడ్ బాయ్

కోలీవుడ్లో వివాదాలకు కేరాఫ్ అడ్రస్ అనదగ్గ హీరో శింబు. అతడి కెరీర్లో ఇప్పటికే లెక్కలేనన్ని వివాదాలున్నాయి. ఇప్పుడు తాజాగా అతణ్ని మరో కాంట్రవర్శీ ఇబ్బందుల్లోకి నెట్టింది. శింబుకు ట్విట్టర్లో ఉన్న అకౌంట్ తరహాలోనే.. ఒక ఫేక్ అకౌంట్ క్రియేట్ చేసి ఎవరో అతడి పేరుతో పెట్టిన మెసేజ్ కలకలం రేపింది. తమిళ ‘బిగ్ బాస్’ షో నుంచి బయటికి వచ్చేసిన ఒవియాను ఉద్దేశించి అందులో ఒక కామెంట్ పెట్టారు.

ఒవియా మీద ప్రశంసలు కురిపిస్తూ.. ఆమెను పెళ్లి చేసుకోవడానికి తాను సిద్ధమని శింబు పేర్కొన్నట్లుగా ఉంది ఆ ట్వీట్లో. ఆ అకౌంట్ పేరు.. దాని డిస్‌ప్లే పిక్.. అన్నీ శింబు ఒరిజినల్ అకౌంట్ మాదిరే ఉండటంతో కోలీవుడ్ మీడియా అది అతడి ట్వీటే అని నమ్మేసింది. ఒవియాను పెళ్లి చేసుకోవడానికి రెడీ అన్న శింబు.. అని హెడ్డింగ్ పెట్టి వార్తలు ఇచ్చేశారు. దీంతో ఇది కోలీవుడ్లో హాట్ టాపిక్ అయింది. ఐతే కొంచెం ఆలస్యంగా విషయం గ్రహించిన శింబు.. దీనిపై వివరణ ఇస్తూ పెద్ద ప్రెస్ నోట్ ఇచ్చాడు. ఆ అకౌంట్ తనది కాదని.. ఎవరో కావాలనే కుట్ర పన్ని ఇలా చేశారని.. ఒవియా గురించి తాను ఎలాంటి కామెంట్ చేయలేదని వివరణ ఇచ్చాడు శింబు.

పనిలో పనిగా ఇలా చేసిన వాళ్లకు వార్నింగ్ కూడా ఇచ్చాడు. ఇలా ఎవరు చేస్తున్నారో తనకు తెలుసని.. వాళ్లు ఇలాంటివి మానుకోకుంటే నెక్స్ట్ టైమ్ తన జవాబు వేరే రకంగా ఉంటుందని హెచ్చరించాడు శింబు. మొత్తానికి ఈ వ్యవహారం రెండు రోజుల పాటు కోలీవుడ్‌ను కుదిపేసింది. గతంలో నయనతారతో ప్రేమ వ్యవహారం-గొడవ.. అమ్మాయిల మీద రాసిన బూతు పాట.. ఇంకా శింబు చుట్టూ చాలా వివాదాలే నడిచాయి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు