'భానుమ‌తి' ఆ సినిమాతోనే 'ఫిదా' చేయాల్సింద‌ట‌!

'భానుమ‌తి' ఆ సినిమాతోనే 'ఫిదా' చేయాల్సింద‌ట‌!

టాలీవుడ్ లో యూత్ ను మెస్మ‌రైజ్ చేసిన సినిమాల్లో ఫిదా కు ఓ ప్ర‌త్యేక‌త ఉంది.  ప్ర‌స్తుతం టాలీవుడ్ తో పాటు తెలుగు రాష్ట్రాల్లో చాలామంది హీరోయిన్ సాయి పల్ల‌వి న‌ట‌న‌కు ఫిదా అయిపోయారు. అచ్చ తెలంగాణ యాస‌లో స్వతంత్ర భ‌వాలున్న యువ‌తి భానుమ‌తి పాత్ర‌లో సాయి ప‌ల్ల‌వి జీవించింది.

ద‌ర్శ‌కుడు శేఖ‌ర్ క‌మ్ముల ఆ క్యారెక్ట‌ర్ ను మ‌లిచిన తీరుకు ప్రేక్ష‌కులు ఫిదా అయ్యారు. ఫిదాతో దర్శకుడిగా శేఖర్ కమ్ముల స్టామినాను చూపించారు. అయితే, సాయి ప‌ల్లవి ఎప్పుడో టాలీవుడ్ కు ప‌రిచ‌యం అయ్యేద‌ట‌. ఇదే విష‌యాన్ని స్వ‌యంగా శేఖ‌ర్ క‌మ్ముల వెల్ల‌డించారు.

'లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్' సినిమాలో న‌టించేందుకు సాయిపల్లవిని సంప్రదించానని శేఖర్ కమ్ముల చెప్పారు. సాయి ప‌ల్ల‌వి అప్పుడు డిగ్రీ చదువుతోందట. సాయి ప‌ల్ల‌వి ఎంబీబీఎస్ చదవడానికి వెళుతుందనీ, అది పూర్త‌యిన త‌ర్వాతే సినిమాలు చేస్తుందని సాయిపల్లవి తల్లి తేల్చి చెప్పిందట.

దీంతో, చేసేదేమీ లేక తాను సైలెంట్ గా తిరిగి వచ్చేశానని శేఖ‌ర్ చెప్పారు. ఆ త‌ర్వాత ఇన్నాళ్ల‌కు  'ఫిదా'తో తమ కాంబినేషన్ కుదిరిందని చెప్పారు. సాయి ప‌ల్ల‌వి మంచి నటి అంటూ శేఖర్ కమ్ముల కితాబిచ్చారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు