బోయపాటి కూడా బాలకృష్ణ టైపే

బోయపాటి కూడా బాలకృష్ణ టైపే

బాలకృష్ణతో వరుసగా రెండు సినిమాలు చేయడం వలనో లేక స్వతహాగా తన తీరు అంతేనో తెలియదు కానీ తన పంతం నెగ్గించుకోవడంలో మాత్రం బోయపాటి కూడా బాలకృష్ణ టైప్‌ అనిపించుకున్నాడు. మామూలుగా బాలకృష్ణ సినిమాలని ఎంత పోటీ వున్నా కానీ వెనక్కి జరపరు. చాలా సార్లు క్లాష్‌లోనే బాలయ్య సినిమాలు రిలీజ్‌ అవుతుంటాయి.

ఇప్పుడు బోయపాటి సినిమా కూడా మరో రెండు చిత్రాలతో పోటీ పడుతోంది. అది కూడా ఒకే రోజున. నిజానికి 'జయ జానకి నాయక' నిర్మాత మిగతా రెండు సినిమాల నిర్మాతలతో పోలిస్తే వీక్‌, అనుభవం లేదు. పెద్ద నిర్మాతల నుంచి ఒత్తిడి వున్నపుడు సహజంగా కొత్త నిర్మాతలు వెనక్కి తగ్గుతారు. కానీ బోయపాటి శ్రీను మాత్రం నిర్మాతని వెనకడుగు వేయనివ్వలేదు. తన సినిమాకి ఈ డేట్‌ కావాల్సిందేనని పట్టుబట్టి కనీసం ఒకరోజు ముందుగా కూడా జయ జానకి నాయక రిలీజ్‌ చేయడానికి అంగీకరించలేదు.

అప్పటికప్పుడు రిలీజ్‌ డేట్‌ మారిస్తే ఓవర్సీస్‌లో ప్రీమియర్స్‌కి ఇబ్బంది వస్తుందని చెప్పి ఆగస్టు 11నే తమ సినిమా వస్తుందని చెప్పాడు. పోనీ ఒక రెండు వారాలు వాయిదా వేసుకోమంటే, ఇప్పుడు రెండు సినిమాలకి భయపడి వెనక్కి వెళితే తమ సినిమాపై క్రేజ్‌ తగ్గిపోతుందని, సినిమాపై తమకే నమ్మకం లేదనే అభిప్రాయం వస్తుందని చెప్పి 'బాగున్న సినిమానే ఆడుతుందిలెండి. దాన్ని ఎవరూ మార్చలేరుగా' అనేసి అటు, ఇటు వెళ్లేది లేదని తేల్చేసాడట.

నిర్మాత తగ్గినా కానీ దర్శకుడు పట్టు పట్టడంతో, అతనికి బెల్లంకొండ సురేష్‌ కూడా వంత పాడడంతో జయ జానకి నాయక రిలీజ్‌ ఆగస్టు 11న పక్కా అయింది. ప్రస్తుతం బోయపాటి పంతం, పట్టుదల గురించే తెలుగు సినిమా పరిశ్రమ వర్గాలు కథలు కథలుగా మాట్లాడుకుంటున్నాయి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English