అమ్మడిది ఐరెన్‌లెగ్‌ అండీ బాబూ

 అమ్మడిది ఐరెన్‌లెగ్‌ అండీ బాబూ

వరుస ఫ్లాప్‌ సినిమాల్లో నటించే హీరోయిన్లకి ఐరెన్‌ లెగ్‌ బ్రాండ్‌ వేసేయడం అనేది మామూలే. ఇప్పటికి చాలా మందిపై పడ్డ ఈ ముద్ర తాజాగా ప్రగ్యా జైస్వాల్‌పై పడింది. ఈమె నటించిన సినిమాలన్నీ బాక్సాఫీస్‌ వద్ద బాల్చీ తన్నేస్తూ వుండడంతో ప్రగ్యని ఐరెన్‌లెగ్‌ అంటున్నారు. మిర్చిలాంటి కుర్రాడుతో పరిచయమైన ప్రగ్య ఆ తర్వాత కంచెతో గుర్తింపు తెచ్చుకుంది. ఆ సినిమా కమర్షియల్‌గా పే చేయకపోయినా విమర్శకుల ప్రశంసలు అందుకుంది. దాంతో ప్రగ్యాకి అవకాశాలు బాగానే వచ్చాయి.

కానీ ఓం నమో వెంకటేశాయ, గుంటూరోడులాంటి ఫ్లాపులు ఆమెని బిజీ కానివ్వలేదు. ఈ నేపథ్యంలో కృష్ణవంశీ నక్షత్రంపై ఆమె చాలా ఆశలు పెట్టుకుంది. ఈ చిత్రం కోసం ఫైట్లు నేర్చుకుని, బికినీల్లో సైతం కనిపించిన ప్రగ్యా కష్టం ఫలించలేదు. నక్షత్రం డిజాస్టర్లకే డిజాస్టర్‌ అనే రీతిన ఫ్లాప్‌ అవడంతో ప్రగ్యాపై ఐరెన్‌లెగ్‌ ముద్ర పడిపోయింది. తదుపరి రాబోతున్న చిత్రం 'జయ జానకి నాయక'కి బోయపాటి శ్రీను లాంటి బ్యాంకబుల్‌ దర్శకుడు వున్నాడు కనుక తన సుడి తిరుగుతుందని ఆమె ఆశిస్తోంది.

రకుల్‌ హీరోయిన్‌ అయినా కానీ ప్రగ్యాకి సెకండ్‌ హీరోయిన్‌గా చోటు దక్కింది. బోయపాటి అయినా ఆమె కాళ్లకి తగిలించిన ఇనప గొలుసుల్ని తొలగించి బంగారు ఫలితాన్ని ఇస్తాడా లేదా అనేది మరో మూడు రోజుల్లో తెలుస్తుంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు