పటేల్ సార్.. అవును తప్పు చేశాం

పటేల్ సార్.. అవును తప్పు చేశాం

హీరోగా పూర్తిగా మార్కెట్ కోల్పోయాక ‘లెజెండ్’ సినిమాతో విలన్ అవతారంలోకి మారాడు జగపతిబాబు. అక్కడి నుంచి వరుసగా విలన్, క్యారెక్టర్ రోల్స్ చేస్తూ తిరుగులేని క్రేజ్ సంపాదించుకున్నాడు. ఈ ఊపులో ఆయన మళ్లీ హీరోగా మారి ‘పటేల్ సార్’ సినిమా చేశాడు. ఆ సినిమా ప్రోమోలు చూస్తే వావ్ అనిపించింది.

జగపతిబాబు మళ్లీ హీరోగా కూడా తన జోరు చూపిస్తాడేమో అని అంచనా వేశారు. సాయి కొర్రపాటి లాంటి అభిరుచి ఉన్న నిర్మాత ఈ సినిమాను నిర్మించడం కూడా ఈ చిత్రంపై అంచనాలు పెంచుకోవడానికి కారణమైంది. ఐతే ‘పటేల్ సార్’ ఆ అంచనాల్ని ఎంతమాత్రం అందుకోలేకపోయింది. ప్రేక్షకుల్ని తీవ్ర నిరాశకు గురి చేసి ఫ్లాప్ అయింది.

ఐతే విడుదలకు ముందు ‘పటేల్ సార్’ గురించి గొప్పగా చెప్పిన జగపతిబాబు.. ఇప్పుడు మరోలా మాట్లాడాడు. ఈ సినిమా విషయంలో తాము తప్పులు చేశామని అంగీకరించాడు జగపతిబాబు. ‘‘పటేల్ సార్ సినిమా నిరాశపరిచింది. ఆ సినిమాపై చాలా ఆశలు పెట్టుకుున్నా. మా వైపు నుంచి కొన్ని తప్పులు జరిగాయి. ట్రైలర్ చూసిన ప్రేక్షకులు ఇదేదో థ్రిల్లర్, హార్రర్ టైపు సినిమా అనుకున్నారు. కానీ మేం కుటుంబ కథను చూపించేసరికి నిరాశ చెందారు. ప్రేక్షకులు బిరియానీ కోసం వస్తే మేం మామూలు భోజనం పెట్టాం. అందుకే అంచనాలు తారుమారయ్యాయి’’ అని జగపతిబాబు తెలిపాడు. మళ్లీ హీరోగా సినిమా చేయాలా వద్దా అనే విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని.. ఏదైనా కథను బట్టే ఉంటుందని జగపతిబాబు తెలిపాడు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు