గౌత‌మ్‌, సితార రాఖీ పిక్స్ వైర‌ల్‌!

గౌత‌మ్‌, సితార రాఖీ పిక్స్ వైర‌ల్‌!

దేశ‌వ్యాప్తంగా ఈ రోజు రాఖీ పండుగ‌ను ఘ‌నంగా సెల‌బ్రేట్ చేసుకుంటున్నారు. సెల‌బ్రిటీలు త‌మ సోద‌రుల‌కు రాఖీ క‌ట్టిన ఫొటోలు సోష‌ల్ మీడియాలో హ‌ల్ చ‌ల్ చేస్తున్నాయి. ఇదే త‌ర‌హాలో ఇద్ద‌రు చిన్నారి సెల‌బ్రిటీలు కూడా రాఖీ వేడుకను సెల‌బ్రేట్ చేశారు. ఆ క్యూట్ ఫొటోలు ట్విట్ట‌ర్ లో వైర‌ల్ అయ్యాయి. ప్రిన్స్ మహేశ్ బాబు లిటిల్ ప్రిన్సెస్ సితార‌, కుమారుడు గౌత‌మ్ ల  రాఖీ పండుగ ఫొటోలను మ‌హేశ్ భార్య‌ న‌మ్ర‌త త‌న ట్విట్ట‌ర్ ఖాతాలో పోస్ట్ చేశారు.

తన ముద్దుల కుమార్తె సితార, కుమారుడు గౌతమ్ ల ఫొటోలపై న‌మ్ర‌త‌ చ‌క్క‌టి కామెంట్ కూడా చేశారు. ‘ప్రేమ, అనుబంధం, ఐక్యతతో మరో అద్భుతమైన సంవత్సరం’ అని ట్వీట్ చేశారు. గౌతమ్ కాళ్ల‌కు మొక్కుతూ సితార‌ ఆశీర్వాదం తీసుకుంది. సితార త‌ల‌పై అక్షింత‌లు వేస్తూ గౌత‌మ్ సిగ్గుప‌డుతున్నాడు. సితార‌, గౌత‌మ్ లు బహుమతులు ఇచ్చి పుచ్చుకున్నారు. ఈ క్యూట్ ఫొటోలు ఇంట‌ర్నెట్ లో వైర‌ల్ అయ్యాయి. స్పైడ‌ర్ లోని బూమ్ బూమ్ పాట‌ను లిటిల్ ప్రిన్సెస్ సితార కారులో హ‌మ్ చేస్తున్న వీడియోను ప్రిన్స్ మ‌హేశ్ త‌న ట్విట్ట‌ర్ ఖాతాలో పోస్ట్ చేశాడు. 'తను ఈ పాటను రిపీట్ మోడ్ లో వింటూనే ఉంది. ఇదే తన కొత్త ఫేవరెట్ సాంగ్'  అని ఆ లిటిల్ ప్రిన్సెస్ పై కామెంట్ పెట్టాడు మహేశ్‌.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు