మధుప్రియ ‘బిగ్ బాస్’ ఎలిమినేషన్లో ట్విస్టు

మధుప్రియ ‘బిగ్ బాస్’ ఎలిమినేషన్లో ట్విస్టు

‘బిగ్ బాస్’ తెలుగు షోలో ఇప్పటిదాకా అత్యంత చర్చనీయాంశమైన పేరు ఏదంటే.. మరో మాట లేకుండా మధుప్రియ అని చెప్పేయొచ్చు. ‘బిగ్ బాస్’ హౌస్‌లో అడుగుపెట్టినప్పటి నుంచి అదే పనిగా ఏడుస్తూ.. ‘పాతాళగంగ’ అనే పేరు తెచ్చుకుంది ఈ అమ్మాయి. చిన్నతనంలోనే పెద్ద పెద్ద వేదికలెక్కి పాటలు పాడి పాపులారిటీ సంపాదించుకున్న మధుప్రియ గడుసుపిల్ల అనుకున్నారు కానీ.. ‘బిగ్ బాస్’లోకి వెళ్లాకే ఆమెలోని మరో కోణం బయటపడింది.

ప్రతి రోజూ అదే పనిగా ఏడవడంతో జనాలకు చిరాకొచ్చేసి.. తనకు వ్యతిరేకంగా ఓట్లేశారు. ‘బిగ్ బాస్’ హౌస్‌లో పనులు, టాస్క్‌లు చేయడంలో కూడా మధుప్రియ చురుగ్గా లేకపోవడం కూడా మైనస్ అయింది. తోటి పార్టిసిపెంట్లు కూడా ఆమెకు వ్యతిరేకంగా ఓట్లేశారు. దీంతో రెండు వారాలకే షో నుంచి బయటికి వచ్చేసింది మధుప్రియ. ఐతే తాను తనంతట తానే షో నుంచి బయటికొచ్చానే తప్ప.. తనను ఎవరూ ఎలిమినేట్ చేయలేదని అంటోంది మధుప్రియ.

‘బిగ్ బాస్’ హౌస్‌లో ఉండలేక తానే తోటి పార్టిసిపెంట్లను తనకు వ్యతిరేకంగా ఓట్లు వేయమని అడిగానని.. అందువల్లే తనకు నెగెటివ్ ఓట్లు ఎక్కువ పడి ఎలిమినేషన్‌లోకి వచ్చానని ఆమె చెప్పింది. ప్రేక్షకుల్లో తన మీద అంత వ్యతిరేకతేమీ లేదని భావిస్తున్నట్లు మధుప్రియ చెప్పింది. మూడు రోజుల వరకు ‘బిగ్ బాస్’ హౌస్‌లో బాగానే అనిపించిందని.. కానీ తర్వాత తన వల్ల అక్కడుండటం కాలేదని.. చిన్న పిల్లలు సైతం ఫోన్లు.. గాడ్జెట్స్ లేకుండా ఉండలేకపోతున్నారని.. తాను కూడా ఫోన్ లేక.. నచ్చిన ఫుడ్ తినలేక ఇబ్బంది పడ్డానని.. అందుకే షో నుంచి బయటికి వచ్చేయాలనుకున్నానని ఆమె చెప్పింది. తాను ‘బిగ్ బాస్’ హౌస్‌లో సరిగా పని చేయాలన్న విమర్శలు సరి కాదని.. రోజులో నాలుగైదు గంటలకు మించి పని ఉండదని.. తాను పని చేస్తున్న విజువల్స్ ఎపిసోడ్లలో సరిగా చూపించలేదని ఆమె అంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు