ఆ సినిమాలో మంచు లక్ష్మి కూతురు..

ఆ సినిమాలో మంచు లక్ష్మి కూతురు..

ఈ రోజుల్లో సినిమా రంగానికి చెందిన వాళ్లే కాదు.. వేరే ఫీల్డ్స్‌కు చెందిన వాళ్లు సైతం సినిమాల వైపే చూస్తున్నారు. తమ వారసుల్ని సినిమాల వైపే నడిపిస్తున్నారు. ప్రస్తుతం టాలీవుడ్లో ఉన్నంతమంది వారసులు ఇంకెక్కడా ఉండరేమో.

సినీ ఫ్యామిలీస్‌లో కొత్త తరాలకు చెందిన ప్రతి ఒక్కరూ సినిమాల్లోకే అడుగుపెడుతున్నారు. మోహన్ బాబు వారసత్వాన్ని కొనసాగిస్తూ సినీ రంగ ప్రవేశం చేసిన మంచు లక్ష్మి కూడా తన కూతురు విద్యా నిర్వాణను సినిమాల్లోకే తెచ్చేలా ఉంది. ఇంకా మూడేళ్లు కూడా వయసు రాని విద్యా నిర్వాణను అప్పుడే తెరంగేట్రం చేయించే పనిలో ఉంది లక్ష్మి. తెలుగులో తెరకెక్కుతున్న ఓ ప్రతిష్టాత్మక చిత్రంలో విద్యను నటింపజేయాలని చూస్తోంది లక్ష్మి.

వైజయంతీ మూవీస్ బేనర్లో అశ్వినీదత్ కూతుళ్లు స్వప్న దత్, ప్రియాంక దత్ మహానటి సావిత్రి జీవిత కథతో ‘మహానటి’ సినిమా తీస్తున్న సంగతి తెలిసిందే. స్వప్న భర్త నాగ్ అశ్విన్ ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నాడు. ఈ సినిమాలో చిన్నప్పటి సావిత్రిగా తన కూతురిని నటింపజేయాలని చూస్తోందట మంచు లక్ష్మి. ఈ విషయాన్ని ఆమే స్వయంగా వెల్లడించింది.

సావిత్రి లాంటి మహా నటి జీవిత కథతో తెరకెక్కుతున్న సినిమాలో తన కూతురు నటిస్తే గొప్పగా ఉంటుందని తన ఫీలింగ్ అని.. అందుకే ఎలాగైనా ఆ పాత్రను తన కూతురికే ఇవ్వమని తన ఫ్రెండ్స్ అయిన స్వప్న, ప్రియాంకలను కోరినట్లు లక్ష్మి చెప్పింది. మంరి లక్ష్మి అంతలా అడిగిందంటే అశ్వినీదత్ కూతుళ్లు కాదంటారా? మరి చిన్నప్పటి సావిత్రిగా విద్యా నిర్వాణను చూడబోతున్నట్లేనా?

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English