సూపర్‌స్టార్‌ పతనం కంటిన్యూస్‌

సూపర్‌స్టార్‌ పతనం కంటిన్యూస్‌

బాలీవుడ్‌ని రాజులా ఏలిన షారుక్‌ ఖాన్‌ స్టార్‌డమ్‌ ప్రతి సినిమాకీ పడిపోతూ వస్తోంది. షారుక్‌ సినిమాలతో పోటీగా వేరే సినిమాలు విడుదల చేసే స్థితి నుంచి, వేరే చిత్రాలనుంచి వచ్చే కాంపిటీషన్‌కి భయపడి తన రిలీజ్‌ ప్లాన్స్‌ మార్చుకునే పరిస్థితి వచ్చేసింది. వరుస పరాజయాలతో వున్న షారుక్‌ ఖాన్‌కి తాజా చిత్రం 'జబ్‌ హారీ మెట్‌ సెజల్‌' చిత్రంతోను ఫ్లాప్‌ వచ్చింది.

ఇది మొదటి వారాంతంలో కనీసం యాభై కోట్ల నెట్‌ వసూళ్లు కూడా సాధించలేకపోయింది. దీంతో ఇండియా నుంచి వంద కోట్ల నెట్‌ అయినా వస్తుందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సాధారణంగా షారుక్‌కి ఫ్లాప్‌ వచ్చినపుడు అతని అభిమానులు అయినా దానికి కొమ్ము కాసేవారు.

కానీ ఈ చిత్రానికి అభిమానుల నుంచి కూడా పెదవి విరుపులే వస్తున్నాయి. జబ్‌ వీ మెట్‌ తప్ప కమర్షియల్‌ హిట్‌ లేని ఇంతియాజ్‌ అలీ దర్శకత్వంలో చేయడానికి షారుక్‌ అంగీకరించినపుడే దీనిని ఫ్లాప్‌గా లెక్కగట్టారు. అయితే అంచనాలకి మించిన ఘోర పరాజయం పాలయింది.

దారుణమైన రివ్యూస్‌తో ఈ చిత్రాన్ని క్రిటిక్స్‌ ఏకి పారేస్తే, సోషల్‌ మీడియా ట్రోలింగ్‌ దానికంటే పీక్స్‌లో వుంది. సల్మాన్‌కి ట్యూబ్‌లైట్‌తో ఫ్లాప్‌ రావడంతో, దానికంటే బెటర్‌గా ఆడితే షారుక్‌ని కొంతకాలం గ్లోరిఫై చేయవచ్చునని అనుకున్నారు కానీ ఇది దానికి మించిన ఫ్లాప్‌ అయి ఫాన్స్‌ గాలి పూర్తిగా తీసేసింది. ఏదైనా అద్భుతం జరిగితే తప్ప షారుక్‌ గత వైభవం తిరిగి వచ్చేట్టు లేదు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English