ల‌వ కుశ‌కు 'జై' అన్న సీడెడ్‌!

ల‌వ కుశ‌కు 'జై' అన్న సీడెడ్‌!

కొద్ది రోజుల క్రితం విడుద‌లైన జై ల‌వ‌కుశ  సినిమాలో  జై ఫ‌స్ట్ లుక్ కు పిచ్చ క్రే్జ్ వ‌చ్చింది. జూనియ‌ర్ ఎన్టీఆర్ త్రిపాత్రాభినేయం చేస్తున్న జై ల‌వ‌కుశ చిత్రం పై అభిమానులు భారీ అంచ‌నాలు పెట్టుకున్నారు. దీంతో, 'జై లవ కుశస అప్ డేట్స్ ను ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి ఎంతో ఆసక్తిని క‌న‌బ‌రుస్తున్నారు.  అభిమానుల అంచ‌నాలకు త‌గ్గ‌ట్లుగానే ఆ సినిమా కాపీ రైట్స్ కూడా రికార్డు ధ‌ర‌ల‌కు అమ్ముడ‌వుతున్న‌ట్లు తెలుస్తోంది.

సాధార‌ణంగా సినిమా షూటింగ్  పూర్త‌యిన త‌ర్వాత కాపీరైట్స్ వ్య‌వ‌హారం తెర‌మీద‌కి వ‌స్తుంది. కానీ, ప్ర‌స్తుతం టాలీవుడ్ లో ట్రెండ్ మారింది. సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ లు జోరందుకున్నాయి. సినిమాకు ఉన్న క్రేజ్ ను బ‌ట్టి ఓవ‌ర్సీస్‌, ఆంధ్ర‌, సీడెడ్‌, తెలంగాణ ఏరియాల్లో కాపీ రైట్స్ కోసం క్యూ క‌డుతున్నారు. ఒక వైపున జై ల‌వ‌కుశ‌ సినిమా షూటింగ్ కొనసాగుతూ ఉండగానే ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ ఊపందుకుంది. జై ల‌వ‌కుశ‌కు భారీ క్రేజ్ ఏర్ప‌డ్డ నేప‌థ్యంలో ఈ సినిమా సీడెడ్ రైట్స్ భారీ రేటుకు అమ్ముడైనట్టుగా తెలుస్తోంది.

సీడెడ్ కి సంబంధించిన హక్కులు 12.6 కోట్లకు అమ్ముడైనట్టుగా టాలీవుడ్ టాక్‌. సీడెడ్ హక్కులు ఈ స్థాయి రేటుకు అమ్ముడు పోవడం ఎన్టీఆర్ కెరియర్లో ఇదే తొలిసారి అని ట్రేడ్ విశ్లేష‌కులు అంటున్నారు. ఈ సినిమాలో ఎన్టీఆర్ 'జై ..లవ .. కుశ' అనే మూడు పాత్రలను పోషిస్తున్న సంగ‌తి తెలిసిందే. ఇప్పటికే 'జై' ఫస్టులుక్ ను రిలీజ్ చేశారు. 'రాఖీ' పండుగ సందర్భంగా 'లవ' లుక్ ను ఈ నెల 7వ తేదీన విడుదల చేస్తున్నారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు