బాల‌య్యకు విల‌న్ గా 'ఏటీఎం'!

బాల‌య్యకు విల‌న్ గా 'ఏటీఎం'!

నంద‌మూరి న‌టసింహం బాల‌య్య‌,  పూరి జగన్నాథ్ ల కాంబోల తెర‌కెక్కిన పైసా వసూల్ సినిమా సెప్టెంబ‌రు 1న విడుద‌ల కానున్న సంగ‌తి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ పూర్త‌యిన వెంట‌నే బాల‌య్య త‌న 102 వ చిత్రాన్ని ప్రారంభించేశాడు. ఈ చిత్రానికి కేఎస్ రవి కుమార్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న సంగ‌తి తెలిసిందే. ఈ సినిమాలో నయనతార హీరోయిన్ గా ఫిక్స్  అయింది.

పైసా వసూల్ త‌ర‌హాలోనే ఇది కూడా కంప్లీట్ యాక్ష‌న్ మూవీ అట‌. ఈ యాక్ష‌న్ ఎంటర్ టైనర్ లో బాల‌య్య‌కు విల‌న్ గా స‌రిపోయే ఆర్టిస్ట్ కోసం వెతుకుతున్నార‌ట‌. ఈ సినిమాలో విలన్ కోసం బాలీవుడ్ నుండి టాలీవుడ్ వరకు చాలా మందిని అనుకున్నార‌ట‌. అయితే, అనూహ్యంగా ఈ సినిమాలో సీనియర్ హీరో శ్రీకాంత్ ను విల‌న్ గా ఫిక్స్ చేసుకోవాల‌ని చిత్ర యూనిట్ భావిస్తున్న‌ట్లు టాలీవ‌డ్ టాక్‌.

హీరోగా, కొన్ని క్యారెక్టర్ రోల్స్ లో తెలుగు ప్రేక్ష‌కుల‌ను శ్రీకాంత్ మెప్పిస్తున్నాడు. తాజాగా చైతూ సినిమా యుద్ధ శ‌ర‌ణంతో శ్రీ‌కాంత్  విలన్ గా మారిన విషయం తెలిసిందే. మ‌రోవైపు ఓ కన్నడ సినిమాలో కూడా విలన్ పాత్ర పోషిస్తున్నాడు శ్రీ‌కాంత్‌. ఇప్పుడు బాలయ్య సినిమాలో కూడా విలన్ గా కనిపించేందుకు శ్రీకాంత్ రెడీ అయ్యాడ‌ట‌. ఈ సినిమాకు జయసింహ లేదా రెడ్డిగారు అనే టైటిల్ పెట్టే యోచనలో ద‌ర్శ‌క‌నిర్మాత‌లున్నారు. గ‌తంలో కూడా సీనియ‌ర్ న‌టుడు జ‌గ‌ప‌తిబాబు..లెజెండ్ సినిమాలో విల‌న్ గా ప్రేక్ష‌కుల‌ను అల‌రించిన సంగ‌తి తెలిసిందే.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు