మెగా హీరో కొంప ముంచిన బ్లైండ్‌ భక్తి!

మెగా హీరో కొంప ముంచిన బ్లైండ్‌ భక్తి!

దర్శకుడు కృష్ణవంశీ మీద వీరాభిమానంతో 'నక్షత్రం' చిత్రంలో సాయి ధరమ్‌ తేజ్‌ ఒక ప్రత్యేక పాత్ర చేసాడు. ఈ చిత్రంలో నటించేందుకు గాను పైసా రెమ్యూనరేషన్‌ తీసుకోకుండా ఫ్రీగా చేసి కృష్ణవంశీపై భక్తిని చాటుకున్నాడు తేజు.

అయితే అంత మార్కెట్‌ వున్న హీరో తన సినిమాలో పారితోషికం లేకుండా నటించినా కానీ అతడిని సరిగ్గా చూపించడానికి కృష్ణవంశీ ఏమాత్రం ఎఫర్ట్స్‌ పెట్టలేదు. సాయి ధరమ్‌ తేజ్‌పై పేలవమైన సీన్లు రాయడంతో అతని క్యారెక్టర్‌ వల్ల నక్షత్రానికి ఒరిగింది లేకపోగా, అతని ఇమేజే డ్యామేజ్‌ అయింది. అసలే వరుస ఫ్లాప్స్‌తో వున్నాడేమో పనిలో పనిగా ఈ స్పెషల్‌ క్యారెక్టర్‌ చేసిన సినిమాని కూడా తన ఖాతాలో వేసేస్తున్నారు. తేజు నటించిన కారణంగా ఈ చిత్రానికి ఓపెనింగ్స్‌ పరంగా కాస్త బెనిఫిట్‌ వచ్చింది కానీ అతనికే నటుడిగా ఎలాంటి సంతృప్తిని ఇవ్వని ఈ చిత్రం కనీసం బాక్సాఫీస్‌ విజయాన్ని కూడా అందించలేకపోయింది.

ఇక మీదటైనా అభిమానం పేరుతో సినిమాలు చేయకుండా, కథ విని, క్యారెక్టర్‌ తెలుసుకుని సినిమా చేస్తే మంచిదని అతడికి సోషల్‌ మీడియా ద్వారా చాలా మంది ఉచిత సలహాలిస్తున్నారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు