ఎన్టీఆర్‌, మహేష్‌కి ఎదురెళ్లి పోతున్నాడు

ఎన్టీఆర్‌, మహేష్‌కి ఎదురెళ్లి పోతున్నాడు

దసరాకి రెండు పెద్ద సినిమాలు రిలీజ్‌ వుండడంతో చాలా మంది నిర్మాతలు దసరా బరిలోకి దిగేందుకు సాహసించడం లేదు. అయితే సెప్టెంబరు 21న జై లవకుశ, 27న స్పైడర్‌ వున్నాయని తెలిసినా కానీ సెప్టెంబరు 29న తమ చిత్రాన్ని విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు 'ఉన్నది ఒకటే జిందగీ' నిర్మాత. రామ్‌ హీరోగా నటిస్తోన్న ఈ చిత్రానికి 'నేను శైలజ' దర్శకుడు కిషోర్‌ తిరుమల దర్శకుడు.

నేను శైలజ సూపర్‌హిట్‌ కావడంతో ఈ కాంబినేషన్‌పై అంచనాలు బాగానే వున్నాయి. రామ్‌ కూడా దీనిపై చాలా కాన్ఫిడెంట్‌గా వున్నాడు. అయితే ఎంత కాన్ఫిడెన్స్‌ ఉన్నప్పటికీ రెండు భారీ సినిమాలతో పోటీకి దిగితే థియేటర్ల సమస్య దగ్గర్నుంచి రెవెన్యూ షేరింగ్‌ వరకు అన్నిట్లోను ఇబ్బంది పడాల్సి వస్తుంది. అయినప్పటికీ రిస్క్‌ తీసుకుని హాలిడే సీజన్‌ క్యాష్‌ చేసుకోవాలని చూస్తున్నారు.

ముందుగా ఈ డేట్‌కి రిలీజ్‌ చేద్దామనుకున్న బాలకృష్ణ చిత్రం 'పైసా వసూల్‌' ముందుకెళ్లడంతో దసరా రోజున విడుదల చేస్తే అడ్వాంటేజ్‌ వుంటుందని కొందరు నిర్మాతలు భావిస్తున్నారు. అయితే అందరి కంటే ముందుగా 'ఉన్నది ఒకటే జిందగీ' ప్రొడ్యూసర్‌ ఈ డేట్‌ అనౌన్స్‌ చేసేసారు కనుక మిగతా వాళ్లు వెనక్కి తగ్గవచ్చు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు