పావలా పారితోషకానికే ఇంత ఎక్స్‌పోజింగా?

పావలా పారితోషకానికే ఇంత ఎక్స్‌పోజింగా?

కృష్ణవంశీ కమ్ బ్యాక్ మూవీ అవుతుందని 'నక్షత్రం' మీద చాలా ఆశలే పెట్టుకున్నారు ఆయన అభిమానులు. కానీ ఈ క్రియేటివ్ డైరెక్టర్ ఇంతకుముందు తీసిన సినిమాలే మేలు అనిపించేలా సాగిందా సినిమా. ఇంతకుముందు కృష్ణవంశీ తీసిన ఫ్లాప్ సినిమాలు కూడా ఎంతో కొంత అలరించేవి.

కానీ 'నక్షత్రం' మాత్రం ఏమాత్రం ఎంటర్టైన్ చేయలేకపోయాయి. రెండు గంటల 46 నిమిషాల పాటు సుదీర్ఘంగా సాగిన ఈ సినిమా ప్రేక్షకుల సహనానికి పరీక్ష పెట్టింది. ఐతే సినిమా మొత్తంలో ప్రేక్షకుల్ని అలరించిన అంశమేదైనా ఉందా అంటే.. అది హీరోయిన్లు రెజీనా కసాండ్రా, ప్రగ్యా జైశ్వాల్‌ల గ్లామరే. ఇద్దరూ ఒకరితో ఒకరు పోటీపడి అందాల విందు చేశారు.

విశేషం ఏంటంటే.. 'నక్షత్రం' సినిమా కోసం హీరోయిన్ల మార్కెట్ వాల్యూలో 25 శాతం మాత్రమే పారితోషకంగా ఇచ్చినట్లుగా చెప్పాడు కృష్ణవంశీ. సాయిధరమ్ తేజ్, ప్రకాష్ రాజ్, శివాజీ రాజా, జేడీ చక్రవర్తి లాంటి వాళ్లు అసలు పైసా కూడా తీసుకోకుండా ఈ సినిమాకు పని చేశారట. ఆర్థిక ఇబ్బందుల వల్ల సినిమాను పూర్తి చేయలేని పరిస్థితుల్లో ఇలా అందరూ సహకరించినట్లు కృష్ణవంశీ వెల్లడించాడు.

మిగతా వాళ్ల సంగతేమో కానీ.. హీరోయిన్లిద్దరూ అంత తక్కువ పారితోషకానికే సినిమా చేయడం మాత్రం విశేషమే. మామూలుగా ఎక్స్‌పోజింగ్ ఎక్కువ చేయాల్సి వస్తే.. హీరోయిన్లు అదనంగా పారితోషకం పుచ్చుకుంటారని అంటుంటారు. కానీ రెజీనా, ప్రగ్యా మాత్రం నాలుగో వంతు పారితోషకం తీసుకుని.. ఆ రేంజిలో రెచ్చిపోయి అందాల విందు చేయడం ఆశ్చర్యం కలిగించే విషయమే.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు