ఆ నోటీసులపై ఎన్టీఆర్ ఏమన్నాడంటే..

ఆ నోటీసులపై ఎన్టీఆర్ ఏమన్నాడంటే..

'నాన్నకు ప్రేమతో' సినిమాకు సంబంధించి తీసుకున్న పారితోషకం విషయమై అనుచిత రీతిలో పన్ను మినహాయింపు పొందినందుకు టాలీవుడ్ స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్ తో పాటు బాలీవుడ్ హీరో రణబీర్ కపూర్ లకు కేంద్ర ఆర్థిక శాఖ నోటీసులివ్వడం సంచలనం రేపుతోంది. ఎప్పుడూ ఏ వివాదంలో ఇరుక్కోని ఎన్టీఆర్.. ఉన్నట్లుండి పన్ను మినహాయింపు విషయంలో నోటీసులందుకోడం చర్చనీయాంశమైంది. దీనిపై రకరకాల ఊహాగానాలు నడుస్తున్న నేపథ్యంలో ఎన్టీఆర్ ఆలస్యం చేయలేదు. ఈ నోటీసుల విషయమై తన వివరణ తెలియజేశాడు.

'నాన్నకు తమ సినిమాను పూర్తిగా లండన్లో తీశామని.. కాబట్టి ఆ సినిమాకు భారత్ లో పన్ను వర్తించదని అన్నాడు ఎన్టీఆర్. నోటీసులకు తమ ఆడిటర్ ఇప్పటికే సమాధానం ఇచ్చినట్లు ఎన్టీఆర్ తెలిపాడు. ఆదాయపు పన్నుతో పాటు తాను సేవా పన్నును క్రమం తప్పకుండా కడుతున్నానని.. భారత పౌరుడిగా తాను ఎప్పుడూ బాధ్యతాయుతంగా ఉంటానని.. చట్టాలపై తనకు గౌరవం ఉందని ఎన్టీఆర్ అన్నాడు.

తాను చెల్లించాల్సిన పన్ను ఉన్నట్లు తేలితే అణాపైసలతో సహా చెల్లిస్తానని స్పష్టం చేశాడు. 'నాన్నకు ప్రేమతో' సినిమాకు రూ.7.33 కోట్ల పారితోషకం తీసుకున్న ఎన్టీఆర్.. అందులో 1.10 కోట్లు పన్నుగా కట్టాల్సి ఉందట. ఐతే ఎక్స్ పోర్ట్ ఆఫ్ సర్వీస్ కింద ఎన్టీఆర్ పన్ను మినహాయింపు పొందినట్లు తెలుస్తోంది. సినిమాను ఎక్కువ భాగం లండన్లో షూట్ చేయడంత సేవలు ఎగుమతి చేస్తున్నామన్న కారణం చూపి పన్ను మినహాయింపు పొందినట్లు తెలుస్తోంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English