'పెళ్లిచూపులు' డైరెక్టర్.. ఆ హీరోతో?

'పెళ్లిచూపులు' డైరెక్టర్.. ఆ హీరోతో?

గత ఏడాది చిన్న సినిమాగా విడుదలై.. సెన్సేషనల్ హిట్టయిన చిత్రం 'పెళ్లిచూపులు'. టాలీవుడ్లో ఈ సినిమా ఒక మేలు మలుపు అనే చెప్పాలి. ఈ సినిమాతో తెలుగు సినిమాకు ఎన్నో పాఠాలు నేర్పాడు యువ దర్శకుడు తరుణ్ భాస్కర్. కథాకథనాలు.. పాత్రలు.. సంభాషణలు.. ఇలా అన్ని విషయాల్లోనూ సరికొత్తగా కనిపించిన ఈ చిత్రం కొత్త ఆలోచనలతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టే వర్ధమాన దర్శకులకు స్ఫూర్తిగా నిలిచింది.

ఐతే మామూలుగా తొలి సినిమా పెద్ద హిట్టయితే.. ఆ దర్శకుడిపై అవకాశాల వర్షం కురుస్తుంటుంది. వెంటనే కమిట్మెంట్ ఇచ్చేసి సాధ్యమైనంత త్వరగా రెండో సినిమా మొదలుపెట్టేస్తుంటారు.

కానీ తరుణ్ భాస్కర్ మాత్రం అలా హడావుడి పడలేదు. 'పెళ్లిచూపులు' విడుదలై ఏడాది దాటినా ఇంకా తన రెండో సినిమా సంగతి తేల్చలేదు. తన తొలి సినిమాను రిలీజ్ చేసిన 'సురేష్ ప్రొడక్షన్స్' బేనర్‌కు రెండో సినిమా చేసేలా కమిట్మెంట్ ఇచ్చినట్లు.. సీనియర్ హీరో వెంకటేష్ హీరోగా ఓ సినిమా రూపొందించే అవకాశాలున్నట్లు వార్తలొచ్చాయి.

కానీ వెంకీతో సినిమా మెటీరియలైజ్ కాలేదు. చివరికి తరుణ్.. యువ కథానాయకుడు నిఖిల్‌తో సినిమాకు రంగం సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. దాదాపు ఆరు నెలలుగా తన కొత్త సినిమా స్క్రిప్టు మీద పని చేస్తున్న తరుణ్.. ఎట్టకేలకు ఆ స్క్రిప్టును ఓ కొలిక్కి తెచ్చి నిఖిల్‌కు వినిపించాడట.

అతను ఓకే అన్నాడట. సురేష్ ప్రొడక్షన్స్ వాళ్లే ఈ సినిమాను నిర్మించే అవకాశమున్నట్లు తెలుస్తోంది. రెండు రోజుల కిందట ట్విట్టర్లో.. ఓ పెద్ద బేనర్లో సినిమా కమిటయ్యానని.. త్వరలోనే వివరాలు వెల్లడిస్తానని ప్రకటించాడు నిఖిల్. బహుశా అది ఈ ప్రాజెక్టే అయి ఉంటుందని భావిస్తున్నారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు