ప‌న్ను చెల్లింపు విష‌యంలో తార‌క్ త‌ప్పు చేశాడ‌ట‌

ప‌న్ను చెల్లింపు విష‌యంలో తార‌క్ త‌ప్పు చేశాడ‌ట‌

ప్ర‌భుత్వం తీసుకున్న నిర్ణ‌యాల్లో త‌ప్పుల్ని ఎత్తి చూపిస్తూ.. ప్ర‌జ‌ల సొమ్ముకు ప‌హ‌రా కాసే వ్య‌వ‌స్థ‌ల్లో కాగ్ ఒక‌టి. అధికార‌ప‌క్షానికి చుక్క‌లు చూపించే ఈ వ్య‌వ‌స్థ నుంచి రిపోర్ట్ వ‌స్తుందంటే చాలు అధికార‌ప‌క్షానికి కొత్త టెన్ష‌న్ మొద‌ల‌వుతుంది. కాగ్ రిపోర్టుల్లో చాలా అరుదుగా క‌నిపించే ఓ అంశం ఈసారి తెర మీద‌కు వ‌చ్చింది. ప్ర‌భుత్వ పెద్ద‌ల త‌ప్పుల చిట్టాను విప్పే అల‌వాటున్న కాగ్ ఈసారి ప్ర‌ముఖుల ప‌న్ను మిన‌హాయింపుల విష‌యంలో అనుస‌రించిన వైనాన్ని ప్ర‌శ్నించ‌టం ఇప్పుడు సంచ‌ల‌నంగా మారింది.

ఆ జాబితాలో టాలీవుడ్ ప్ర‌ముఖ హీరోల్లో ఒక‌రైన జూనియ‌ర్ ఎన్టీఆర్ పేరు రావ‌టం ఆస‌క్తిక‌రంగా మారింది. జూనియ‌ర్ ఎన్టీఆర్ కు సేవాప‌న్ను మిన‌హాయింపు ఇచ్చిన వైనాన్ని కాగ్ త‌ప్పు ప‌ట్టింది. విదేశాల్లో సినిమా షూట్ చేశాం కాబ‌ట్టి అది సేవ‌ల ఎగుమ‌తి కింద‌కు వ‌స్తుంద‌ని చూపిస్తూ జూనియ‌ర్ ఎన్టీఆర్ ప‌న్ను చెల్లించ‌లేద‌ని పేర్కొంది. వినోద రంగంలో సేవా ప‌న్నుల చెల్లింపుల్లో జ‌రిగిన అవ‌క‌త‌వ‌క‌ల‌పై కాగ్ అధ్య‌య‌నం చేసి ఓ నివేదిక రూపొందించింది. తాజాగా ఈ నివేదిక‌ను కేంద్ర ఆర్థిక శాఖ స‌హాయ‌మంత్రి అర్జున్ రామ్ మేఘ‌వాల్ శుక్ర‌వారం పార్ల‌మెంటులో ప్ర‌వేశ పెట్టారు.

ఈ నివేదిక‌లో జూనియ‌ర్ ఎన్టీఆర్ ఉదంతాన్ని కూడా ప్ర‌స్తావించింది. నాన్న‌కు ప్రేమ‌తో సినిమాలో హీరోగా న‌టించిన తార‌క్ (జూనియ‌ర్ ఎన్టీఆర్)  లండ‌న్‌కు చెందిన వైబ్రంట్ విజువ‌ల్ లిమిటెడ్ ప్రొడ్యూసింగ్ కంపెనీ నుంచి 2015లో రూ.7.33 కోట్ల పారితోషికంగా తీసుకున్న‌ట్లు కాగ్ త‌న నివేదిక‌లో పేర్కొంది.

ఎగుమ‌తుల సేవ కింద‌కు ప‌రిగ‌ణించి తాను చెల్లించాల్సిన రూ.1.10 కోట్ల సర్వీస్ ట్యాక్స్ మిన‌హాయింపులు పొందిన‌ట్లుగా పేర్కొంది. దీనిపై కేంద్ర ఆర్థిక శాఖ వివ‌ర‌ణ కోర‌గా.. జూనియ‌ర్ ఎన్టీఆర్ కు షోకాజ్ నోటీసు ఇవ్వ‌నున్న‌ట్లు ఆర్థిక శాఖ‌కు అనుబంధంగా ఉండే రెవెన్యూ విభాగం బ‌దులిచ్చింది. జూనియ‌ర్ మాత్ర‌మే కాదు.. ఈ మ‌ధ్య‌న విడుద‌లైన బాలీవుడ్ మూవీ ఏ దిల్ హై ముష్కిల్ ను న్యూయార్క్ లో షూట్ చేసిన‌ట్లు చూపిస్తూ.. స‌ద‌రు సినీ హీరో సైతం రూ.83.43 ల‌క్ష‌ల ప‌న్ను మిన‌హాయింపులు పొందిన విష‌యాన్ని కాగ్ గుర్తించింది. మ‌రీ.. ప‌న్ను చెల్లింపుల విష‌యంలో కాగ్ లేవ‌నెత్తిన సందేహాలు సంచ‌ల‌నంగా మార‌టం ఖాయ‌మ‌న్న‌ట్లుగా చెబుతున్నారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English